Honey Rose: ఆ బిజినెస్ మ్యాన్ నాతో లైంగికంగా.. హనీ రోజ్ షాకింగ్ పోస్ట్.?
Honey Rose: హనీ రోజ్..తన హాట్ అందాలతో వీర సింహారెడ్డి మూవీ తో ఒక్కసారిగా టాలీవుడ్లో ఫేమస్ నటిగా పేరు తెచ్చుకుంది హాని రోజ్. ఈ ముద్దుగుమ్మ 10 సంవత్సరాల ముందే మన టాలీవుడ్ కి వచ్చినప్పటికీ ఆ సమయంలో ఈ హీరోయిన్ ను ఎవరు అంతగా ఆదరించలేదు. కానీ బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలో ఈ హీరోయిన్ పాత్రకి మంచి గుర్తింపు లభించి ఆ తర్వాత వరస అవకాశాలు హనీ రోజ్ కి వస్తున్నాయి.
Honey Rose shocking post on that Business Man
అయితే హనీ రోజ్ తన హాట్ అందాలతో సోషల్ మీడియాలో కూడా చాలామంది యూత్ కి నిద్ర పట్టకుండా చేస్తుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి కూడా గెస్ట్ గా వెళుతుంది. అలా గతంలో ఓ బిజినెస్ మాన్ తనని తన షాప్ ఓపెనింగ్ కి పిలిచారట. ఆ టైంలో హనీ రోజ్ అక్కడికి వెళ్లి షాప్ ఓపెనింగ్ చేసి వచ్చిందట. అయితే ఆ తర్వాత కూడా వేరే షాప్ ఓపెనింగ్ కి రమ్మని ఆయన పిలవగా కుదరదు నాకు వేరే వర్క్ ఉంది అని హనీ రోజ్ చెప్పిందట. ( Honey Rose)
Also Read: Sankranthiki Vasthunnam: “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాని రిజెక్ట్ చేసిన అన్ లక్కీ హీరో.?
కానీ పగ పట్టిన ఆ బిజినెస్ మాన్ హనీ రోజ్ ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చి ఆమెను టార్చర్ చేస్తున్నాడట. అంతేకాదు ఆమెపై సోషల్ మీడియాలో అసభ్య ప్రచారం చేయిస్తూ లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ తాజాగా సోషల్ మీడియాలో ఒక లేఖ ద్వారా బయట పెట్టింది హనీ. ఒక స్త్రీని అలాంటి ఉద్దేశంతో వెంబడిస్తే అది ప్రాథమిక నేరం కిందికి రాదా.. స్త్రీల విషయంలో తప్పుడు ప్రవర్తన ప్రవర్తించే వారికి న్యాయవ్యవస్థ ఎలాంటి రక్షణ అందించలేదా..
ఇలాంటి వ్యాఖ్యలను నేను అస్సలు సహించను అంటూ సోషల్ మీడియాలో ఓ లెటర్ విడుదల చేసింది. ప్రస్తుతం హనీ రోజ్ లెటర్ నెట్టింట వైరల్ గా మారడంతో హనీ రోజ్ ని లైంగికంగా వేధించే ఆ బిజినెస్ మాన్ ఎవరు అంటూ కామెంట్లు పెడుతున్నారు.అంతేకాదు ఆ బిజినెస్మేన్ ని చట్టపరంగా అదుపులోకి తీసుకొని ఆయనపై కేసు నమోదు చేయాలి అని హనీ రోజ్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.( Honey Rose)