Anil Ravipudi: అనిల్ రావిపూడి విన్నింగ్ స్ట్రాటజీ ఇదే.. ఇలా కూడా సెంటిమెంట్ ఉంటుందా?

Anil Ravipudi: టాలీవుడ్‌లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేషియో కలిగిన దర్శకుడు ఎవరు? అనగానే అనిల్ రావిపూడి పేరు ముందుగా వినిపిస్తుంది. రాజమౌళి తరవాత తన సినిమా గ్రాఫ్ ఎప్పుడూ డౌన్ కాకుండా నిలబెట్టుకున్న డైరెక్టర్ అని చెప్పొచ్చు. సంక్రాంతికి విడుదలైన “సంక్రాంతికి వస్తున్నాం” సూపర్ హిట్ కావడంతో, “లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలి” అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, అనిల్ ఫాలో అయ్యే సెంటిమెంట్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పటి వరకు అంతగా ప్రస్తావన రాలేదు. కానీ ఇప్పుడు చూస్తే అది నిజమేనని అర్థమవుతోంది.
How Anil Ravipudi Plans His Scripts
అనిల్ రావిపూడి తన ప్రతి సినిమా కథను మానుకోటలోనే రాస్తారు. 2015లో “పటాస్” తో సినీ ప్రయాణం మొదలుపెట్టిన ఈ యంగ్ కెప్టెన్, అప్పటి నుంచి ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిన తర్వాతే అక్కడి నుంచి కదులుతారట. హీరో ఎవరైనా, ప్రాజెక్ట్ ఎంత పెద్దదైనా మానుకోటలో స్క్రిప్ట్ ఫైనల్ చేయాల్సిందేనని అంటున్నారు. నందమూరి బాలకృష్ణకు “భగవంథ్ కేసరి”లాంటి బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన అనిల్, ఇప్పుడు మెగాస్టార్ కోసం మానుకోటలో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు.
అనిల్ మరో సెంటిమెంట్ కూడా ఫాలో అవుతున్నారు – ప్రతి సినిమాలోనూ ఓ చిన్న కేమియో (Cameo Appearance) చేస్తారు. ఇది ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ అవుతుందని మూవీ లవర్స్ చెబుతున్నారు. ఒకటికి ఒకటి, ఈ డబుల్ సెంటిమెంట్ అనిల్ రావిపూడి సక్సెస్‌కు కీలకమని ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.