Manam Grains: రైతుల కోసం ఉద్యోగం వదిలిన ఇంజినీర్.. చంద్రబాబు ప్రశంసించిన యువ ఉద్యమకారి!!


How Manam Grains Helps Rural Farmers

Manam Grains: ఎవరైనా మంచి ఉద్యోగం, అధిక జీతం, వారానికి ఐదు రోజుల పని, రెండు రోజుల విశ్రాంతి కలిగిన జీవితం వదిలేస్తారా? కానీ బొర్రా శ్రీనివాస్ రావు మాత్రం అలా చేయలేదు. బీహెచ్‌ఈఎల్ (BHEL)లో స్థిరమైన ఇంజినీరింగ్ కెరీర్‌ను వదిలి, రైతులకు మద్దతుగా నిలిచేందుకు ప్రయాణం ప్రారంభించాడు. తన మెకానికల్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్‌ను ఉపయోగించి, గిరిజన రైతులకు సహాయం చేసే లక్ష్యంతో మన్యం గ్రెయిన్స్ (Manyam Grains) అనే సంస్థను స్థాపించాడు. ఈ ప్రాజెక్ట్ ద్వారా, ఆయన నేరుగా రైతుల నుంచి తృణధాన్యాలను (Millets) సేకరించి, ప్రాసెసింగ్ చేసి మార్కెట్‌లో అమ్మడం ప్రారంభించాడు.

How Manam Grains Helps Rural Farmers

తన కార్పొరేట్ కెరీర్‌ను వదిలేయడానికి ప్రధాన కారణం వ్యవసాయ సంక్షోభంపై అతనికి వచ్చిన అవగాహన. భువనేశ్వర్‌లోని జేవియర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో (Xavier Institute of Management) చదువుతున్నప్పుడు, రైతు ఆత్మహత్యల గురించి వచ్చిన కథనాలు అతనిని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలనే లక్ష్యంతో, అతను గిరిజన రైతులను ప్రోత్సహించేందుకు తన వ్యాపారాన్ని అనకాపల్లి (Anakapalli)లో ప్రారంభించాడు. సరసమైన ధరలు, వ్యవసాయ శిక్షణ, నమ్మకమైన మార్కెట్‌ను రైతులకు అందించడం ద్వారా, మన్యం గ్రెయిన్స్ వారి ఆదాయాన్ని 20-30% పెంచడంలో సహాయపడింది.

శ్రీనివాస్ రావు యొక్క కృషి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి (Chandrababu Naidu) దృష్టికి వచ్చింది. తృణధాన్యాల సాగును ప్రోత్సహిస్తూ, 400-500 మంది రైతులను సాధికారత కల్పించారని ఆయన ప్రశంసించారు. అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి రైతుల కోసం కృషి చేయడమే నిజమైన నిస్వార్థం అని పేర్కొన్నారు. త్వరలోనే శ్రీనివాస్‌ను కలవాలని చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఈ కథ నేటి యువతకు గొప్ప ప్రేరణ. ఒక వ్యక్తి తన సొంత ప్రయోజనాల కంటే, సమాజానికి మేలు చేసే మార్గాన్ని ఎంచుకుంటే ఎంతటి మార్పు తీసుకురాగలడో బొర్రా శ్రీనివాస్ రావు నిరూపించారు. ఈ మార్గాన్ని అనుసరించాలనుకునే వారు, మన్యం గ్రెయిన్స్ లాంటి సామాజిక ప్రాజెక్టులను ఆదరించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *