Yuvraj: పెన్షన్ డబ్బులతో బతుకుతున్న టీమిండియా ప్లేయర్ ?
Yuvraj: యువరాజ్ సింగ్ డబ్బులను సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అయితే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న అనంతరం బీసీసీఐ నుంచి యువరాజ్ సింగ్ కి ఎంత ఆదాయం అందుతుంది అనే విషయాలను తెలుసుకుందాం. మీడియా కథనాల ప్రకారం…. యువరాజ్ సింగ్ నెలకు రూ. 22,500 పెన్షన్ పొందుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది అధికారిక లెక్కలు కావు. Yuvraj
How much pension does Yuvraj Singh receive from BCCI
2019లో రిటైర్మెంట్ ముందు పేపర్లలో నమోదు చేసిన బీసీసీఐ నుంచి యువరాజ్ అందుకోబోయే మొత్తం ఇదే ఆదాయమని బోర్డు అధికారులను ఉటంకిస్తూ ప్రముఖ మీడియా సంస్థ వార్తలను రాసింది. అయితే యువరాజ్ సింగ్ కి ఇది ఒక్కటి మాత్రమే ఆదాయ వనరు కాదు. యువరాజ్ సింగ్ మొత్తం దాదాపు రూ. 291 కోట్లు ఆదాయం ఉంటుందని సమాచారం. యువరాజ్ సింగ్ తన బ్రాండ్ ఎండార్స్మెంట్ల నుండి ప్రతినెల దాదాపు రూ. ఒక కోటి రూపాయల డబ్బులు సంపాదిస్తాడు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా చాలా పెట్టుబడులు పెట్టాడు. Yuvraj
తన ఫిట్నెస్, స్పోర్ట్స్ సెంటర్ల నుంచి కూడా భారీగా డబ్బులను సంపాదిస్తున్నాడు. కాగా, ఈరోజు యువరాజ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా అతనికి ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 2007 టీ20 ప్రపంచ కప్ సందర్భంగా ఇంగ్లాండ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒక ఓవర్ లో యువరాజ్ సింగ్ 6 సిక్సర్లు చేశాడు. టీ20 ప్రపంచ కప్ లో ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా యువరాజ్ సింగ్ నిలిచాడు. వన్డే క్రికెట్ లో 7వ స్థానంలో ఆడుతున్న సమయంలో యువరాజ్ సింగ్ ఏడు సెంచరీలు చేశాడు. ఈ ఆడుతున్నప్పుడు అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా యువరాజ్ సింగ్ కి రికార్డు ఉంది. Yuvraj