Hydra: మూసీ నది ఇరువైపులా జరుగుతున్న సర్వేలకు హైదరాబాద్ నగర పాలక సంస్థకు ఎలాంటి సంబంధం లేదని, ఈ సర్వేల ద్వారా నది పరివాహక ప్రాంత ప్రజలను వెళ్లగొట్టే ప్రయత్నం లేదని హైదరాబాద్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ స్పష్టం చేశారు. ఈ విషయం ప్రజలకు తెలియజేసే క్రమంలో, ఆయన సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న తప్పుడు సమాచారాన్ని ఖండించారు.
Hydra Ranganath Clarifies Survey’s Purpose Near Musi River
మూసీ నది అందాన్ని పెంచేందుకు చేపట్టిన మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు కింద ఈ సర్వేలు నిర్వహిస్తున్నారని కమిషనర్ తెలిపారు. ఈ సర్వేలు భౌగోళిక సమాచారాన్ని సేకరించి, నది పరిసర ప్రాంతాల పరిస్థితులను అర్థం చేసుకోవడమే ఉద్దేశ్యమని, ఎవరైనా ఇళ్లను కూల్చివేయాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
Also Read: Tirumala Ghee Adulteration: తిరుమల లడ్డూ కల్తీ.. కొత్త మలుపులు తిరుగుతున్న సిట్ విచారణ!!
సోషల్ మీడియాలో నగర పాలక సంస్థ మూసీ నది తీర ప్రాంతంలోని ఇళ్లపై మార్కింగ్ చేస్తోందనే వదంతులు తప్పుడు వేనని, ప్రజలు ఆ వదంతులను నమ్మవద్దని కమిషనర్ సూచించారు. “మూసీ నదిని పరిశుభ్రంగా ఉంచి, దాని అందాన్ని పెంచడమే మా ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం” అని ఆయన వివరించారు.
మూసీ నది పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఆందోళన చెందవద్దని, ఈ సర్వేలు వారి భవిష్యత్తుపై ప్రభావం చూపవని, ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకుంటుందని కమిషనర్ భరోసా ఇచ్చారు.