Allu Arjun: మీ బాస్ కి నేనే బాస్.. మళ్లీ కెలికిన అల్లు అర్జున్..?
Allu Arjun: అల్లు మెగా ఫ్యామిలీ మధ్య గత కొద్ది రోజులుగా కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ కోల్డ్ వార్ అనేది లోలోపల జరుగుతుంది.కానీ బయటికి మాత్రం మేమంతా ఒకే ఫ్యామిలీ అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇప్పటికే చాలాసార్లు పరోక్షంగా మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య విభేదాలు బయటపడ్డాయి ఇక పుష్ప-2 సినిమా విడుదల కాబోతుందన్న నేపథ్యంలో కూడా చాలామంది మెగా హీరోలు స్పందించలేదు.
I am the boss of your boss Allu Arjun dialogue
ఒక్క సాయి ధరంతేజ్ తప్ప.. ఇక నాగబాబు పరోక్షంగా స్పందించారు.కానీ సినిమాకి సంబంధించి ఎక్కడా కూడా పేరు పెట్టలేదు. మరి ఇప్పుడైనా స్పందిస్తారో లేదో తెలియదు కానీ సినిమా చూసే ప్రేక్షకులకు మాత్రం అల్లు అర్జున్ మళ్లీ మెగా ఫ్యాన్స్ ని కెలికాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్తాడు. (Allu Arjun)
Also Read: Pushpa 2 Box Office Predictions: తొలిరోజు 300 కోట్లు పక్కా.. పుష్ప 2 కి భారీ ఓపెనింగ్స్!!
అదేంటంటే.. మీ బాస్ కి నేనే బాస్.. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి బాస్ అంటే అందరూ మెగాస్టార్ చిరంజీవి నే చెబుతారు. అయితే అలాంటి చిరంజీవి ఇండస్ట్రీకి బాస్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే పుష్పటు సినిమాలో మీ బాస్ కి నేనే బాస్ అంటూ అల్లు అర్జున్ పరోక్షంగా చిరంజీవికి నేనే బాస్ అంటూ చెప్పుకున్నారని మెగా ఫ్యాన్స్ ఈ డైలాగ్ పై మండిపడుతున్నారు.
అంతేకాదు కావాలనే అల్లు అర్జున్ ఈ డైలాగ్ పెట్టించుకున్నారని కూడా కామెంట్స్ చేస్తున్నారు మరి ఈ డైలాగ్ స్టోరీలో భాగంగా వచ్చిందా..లేక కావాలనే అల్లు అర్జున్ పెట్టించుకున్నారా అనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో అల్లు మెగా ఫ్యాన్స్ మధ్య మళ్ళీ వార్ స్టార్ట్ అయిపోయింది.(Allu Arjun)