Sai Pallavi: ఆ తప్పు నేను చేయలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి.?

Sai Pallavi: సాయి పల్లవి తెలుగు తమిళ ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు సాధించినటువంటి హీరోయిన్. అలాంటి ఈమె న్యాచురల్ బ్యూటీగా ఎంతో పేరు తెచ్చుకుంది. ఇక సాయి పల్లవి నటనే కాకుండా డాన్స్ కూడా అదరగొట్టేస్తుంది. అంతేకాదు ఎలాంటి బోల్డ్ పాత్రలు చేయకుండా సాధారణ పాత్రలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా పేరు సాధించింది. ఈ విధంగా ఎంతో దూసుకుపోతున్న సాయిపల్లవి తన కెరియర్ మొదట్లో మీడియా వాళ్ల వల్ల విపరీతంగా బాధపడిందట. చేయని తప్పుకు చలించిపోయిందట. మరి ఆమె ఏం చేసింది ఆ వివరాలు ఏంటో చూద్దాం..
I didnot do that mistake Sai Pallavi in tears
ప్రస్తుతం సాయిపల్లవి మేజర్ ముకుంద్ వరదరాజన్ రియల్ స్టోరీ అయినటువంటి అమరన్ చిత్రంలో నటించింది. ఇందులో శివ కార్తికేయన్ హీరోగా చేశారు. చిత్రం థియేటర్స్లోకి వచ్చి అద్భుతమైన హిట్ సాధించింది. అంతేకాదు నాగచైతన్య హీరోగా నటించిన తండేల్ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు కూడా రాబోతోంది. అలాంటి ఈ తరుణంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయిపల్లవి ఎమోషనల్ కామెంట్స్ చేసింది.. దాదాపు కొన్ని సంవత్సరాల క్రితం నేను మీడియాతో మాట్లాడడానికి కూర్చున్నాం.(Sai Pallavi)
Also Read: Shiva Movie:శివ మూవీలో హీరోగా ఆ స్టార్..కానీ నాగార్జున ఎలా వచ్చాడంటే.?
అప్పటికి ప్రెస్ మీట్ స్టార్ట్ కాలేదు కెమెరాలు కూడా ఆన్ చేయలేదు. ఇంతలో మలయాళ నటీనటులు అందరూ ఇంత బాగా తెలుగు ఎలా మాట్లాడుతున్నారని ఒక విలేకరి నన్ను అడిగారు.. నేను మలయాళిని కాదండి తమిళనాడు నుంచి వచ్చాను అని చెప్పాను. అర్థం చేసుకున్న ఒక విలేకరి మరునాడు మలయాళీ అని పిలిచినందుకే సాయిపల్లవి రిపోర్టర్స్ పై సీరియస్ అయింది అంటూ పెద్ద హెడ్డింగ్ పెట్టి వార్త రాశారు. ఆ వార్త చూసిన నాకు చాలా బాధనిపించింది.

కేరళ నుంచి వచ్చాను అన్నందుకే వారు తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ ఆమె ఎమోషనల్ అయిందట.. ఈ ఘటన జరిగిన మరుసటి రోజు ఎయిర్పోర్టులో సాయి పల్లవిని ఒక మహిళతో కలిసి మాట్లాడిందట..ఆ టైంలో ఆ మహిళ మలయాళంలో మాట్లాడుతూనే అయ్యో సారీ అండి నేను మలయాళంలో మాట్లాడితే మీకు కోపం రాదు కదా అని అడిగిందట. ఆ మాట విన్న నాకు చాలా బాధనిపించింది.. నేను కేరళ అన్నందుకు నన్ను ఆ విధంగా జనాలు కూడా అర్థం చేసుకున్నారని, చేయని తప్పుకు నేను చాలా ఎమోషనల్ అయ్యానని చెప్పుకొచ్చింది.(Sai Pallavi)