Nagababu: వాడెవడో నాకు తెల్వదు.. నాగబాబుపై బాలయ్య షాకింగ్ కామెంట్స్.. పాత పగ మళ్లీ స్టార్ట్..?
Nagababu: మెగా ఫ్యామిలీలో డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే చాలామందికి టక్కున గుర్తుకు వచ్చేది నాగబాబు మాత్రమే.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ను ఎవరు ఏమన్నా టక్కున రియాక్ట్ అయి వారిపై కౌంటర్లు వేస్తూ ఉంటారు నాగబాబు. అలాంటి నాగబాబు పవన్ కళ్యాణ్ అంతలా ఎదగడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఇదే తరుణంలో ఆయన కష్టానికి ఫలితంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్లోకి తీసుకు వస్తారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
I don’t know who it is Balayya shocking comments on Nagabab
మొదటగా ఈయనకు టీటీడీ చైర్మన్ అన్నారు కానీ అది కుదరలేదు. దీంతో రాజ్యసభకి ఆయనను తీసుకుంటారని చెప్పారు. కానీ అది కూడా కలగానే మిగిలింది. తాజాగా తెలుగుదేశం పార్టీకి రెండు, బిజెపికి ఒక రాజ్యసభ సీట్ కరారైన సందర్భంగా నాగబాబుకు జనసేన నుంచి పదవి లభిస్తుందని దీంతో కేబినెట్ లో కూడా చేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే జనసేన పార్టీ విజయంలో నాగబాబు చాలా కీలకంగా వ్యవహరించారు. ఈ విధంగా వార్తలు వస్తున్న తరుణంలో గతంలోని ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. (Nagababu)
Also Read: Mohan Babu: మనోజ్ కి షాక్.. మోహన్ బాబు ఆస్తి కి అసలైన వారసులు వాళ్లే..?
ఆ ఇంటర్వ్యూలో యాంకర్ బాలకృష్ణ గురించి మీరు చెప్పాలని అడగ్గా , బాలకృష్ణ అంటే పాత యాక్టర్ కదా, నేరం-శిక్ష సినిమాలో నటించిన బాలయ్య పెద్ద ఆర్టిస్ట్ అని చెప్పుకొచ్చారు. అసలు బాలయ్య అంటే ఎవరు అని మరోసారి యాంకర్ ప్రశ్నించగా ఆయన ఎవరో నాకు తెలియదని సమాధానం ఇచ్చారు. అయితే ప్రస్తుతం నాగబాబుకు మంత్రివర్గంలో చోటు లభిస్తుంది అనే వార్తలు వస్తున్న తరుణంలో ఈ వీడియో వైలవుతోంది. ఈ క్రమంలో బాలకృష్ణ ట్విట్టర్ హ్యాండిల్ లో ఉన్నటువంటి మరొక లైన్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
” సారీ నాగబాబు ఎవడో నాకు తెలియదు” అని ఒక ట్విట్ రాసి ఉంది. బాలకృష్ణ పేరుతో ఉన్న ఈ ట్వీట్ పై ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ సాగుతోంది.. ఈ ట్వీట్ ను బాలకృష్ణనే చేశారా, లేదంటే ఆయన పేరుతో ఎవరైనా చేశారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వ్యవహారం గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ సాగుస్తూ ట్రోల్ చేస్తున్నారు నేటిజన్స్.అయితే గతంలో నాగబాబు బాలకృష్ణ అంటే ఎవరో తెలియదని మాట్లాడటం వల్లే ప్రస్తుతం బాలకృష్ణ ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ విధంగా పోస్ట్ పెట్టినట్టు తెలుస్తోంది. అలా పాత పగ మళ్ళీ కొత్తగా తెర మీద వినిపిస్తోంది.(Nagababu)