Trisha: విజయ్ లో నాకది నచ్చదు..గోడ పక్కన కూర్చొని అలా చేస్తాడు.. త్రిష షాకింగ్ కామెంట్స్.?
Trisha: హీరో విజయ్ కోలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా ఎంతో గుర్తింపు పొందారు.. అలాంటి ఈయన ఏ సినిమా చేసిన అందులో ఏదో ఒక మెసేజ్ మాత్రం తప్పక ఉంటుంది. అలాంటి విజయ్ ఈ మధ్యకాలంలోనే తమిళనాడులో ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఆ పార్టీని బలపరిచే విధంగా కసరత్తులు చేస్తున్నారు. అలాంటి ఈయన ఇక చివరి చిత్రంగా హెచ్ వినోద్ డైరెక్షన్ లో జననాయకన్ మూవీ చేస్తున్నారు. ఇందులో విజయ్ సరసాన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే చేస్తోందట. ఈ సినిమా తర్వాత విజయ్ పూర్తిగా సినిమాలకు పులిస్టాప్ పెట్టేస్తారట.

I dont like it in Vijay Trisha comments viral
అలాంటి ఈ తరుణంలో విజయ్ గురించి త్రిష ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. త్రిష కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంది. ఈమె ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు ఇప్పటికే పూర్తయిపోయాయి.. ఈ 22 సంవత్సరాల కెరియర్ లో ఎన్నో చిత్రాల్లో, ఎంతోమంది హీరోలతో నటించింది. కానీ వీరందరిలో కెల్లా ఆమె విజయ్ తో నటించడం చాలా స్పెషల్ అంటూ చెప్పుకొస్తుంది. అంతే కాదు విజయ్ త్రిష మధ్య లవ్ కూడా నడుస్తోందని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు కూడా వినిపించాయి. (Trisha)
Also Read: Chiranjeevi: పాన్ ఇండియా హీరోకి వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి.. తోలు తీస్తా నా కొడకా అంటూ.?
కానీ ఈ విషయాన్ని ఈ ఇద్దరు చాలా పాజిటివ్ గా తీసుకొని ముందుకు వెళ్లారు. అలాంటి ఈ సమయంలో త్రిష విజయ్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది. వీరిద్దరూ కలిసి లియో అనే చిత్రంలో నటించారు. అయితే ఈ మూవీ అనుకున్న విజయాన్ని సాధించకపోయినా కానీ మంచి వసూళ్లు చేపట్టింది. ఎప్పుడైతే ఈ సినిమాలో ఇద్దరు కలిసి నటించారో అప్పటి నుంచి వీరి మధ్య మళ్ళీ ఏదో నడుస్తుందని వదంతులు వచ్చాయి అంతేకాకుండా విజయ్ పెట్టిన రాజకీయ పార్టీలో త్రిష కూడా చేరబోతుందని అన్నారు.

దీనిపై వెంటనే స్పందించిన త్రిష తల్లి ఉమా కృష్ణన్ అలాంటిదేమీ లేదని ఖండించారు. తాజాగా త్రిష ఒక ఇంటర్వ్యూలో పాల్గొని షూటింగులో నటుడు శింబు తనను ఏదో ఒకరకంగా టీజ్ చేస్తారని చెప్పింది. కానీ విజయ్ మాత్రం ఒక గోడ పక్కన కూర్చొని చాలా మౌనంగా ఉంటారని ఆయనలో నాకు ఇది నచ్చలేదని చెప్పుకొచ్చింది. దీంతో త్రిష చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో కొంతమంది నెటిజన్స్ త్రిష విజయ్ దగ్గర నుంచి ఏదో కోరుకుంటుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.(Trisha)