NARA LOKESH :నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. లోకేశ్ సెటైర్

NARA LOKESH : ఆంధ్ర‌ప‌ద్రేశ్ లో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీ నేతల మ‌ధ్య నిత్యం మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఇటీవ‌ల ఏపీ మంత్రి నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ ను వీక్షించిన విష‌యం తెలిసిందే. అయితే చంద్ర‌బాబు ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు వైసీపీ టార్గెట్ చేస్తోంది. ఫిబ్ర‌వ‌రి 15న కొలొంబోలో జ‌రిగిన భార‌త్-పాకిస్తాన్ మ‌ధ్య టీ-20 మ్యాచ్ జ‌రిగింది. ఆ మ్యాచ్ కి మంత్రి లోకేష్ హాజ‌ర‌య్యారు.

Also Read : Rajyasabha elections: రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌.. తెలంగాణ ఎన్ని స్థానాలు ఖాళీ అంటే..?

రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయి ఉంద‌నుకున్న స‌మ‌యంలో మంత్రి క్రికెట్ మ్యాచ్ చూసేందుకు కోటికి పైగా ఖ‌ర్చు చేశారంటూ వార్త‌లు వినిపించిన విష‌యం తెలిసిందే. దీనిపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చేశారు. ఆ మ్యాచ్ కి ఫ్లైట్ టికెట్, మ్యాచ్ టికెట్ త‌న సొంత ఖ‌ర్చులు అని క్లారిటీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. నా దుడ్ల‌తో తాను మ్యాచ్ చూశాన‌ని.. నీ దుడ్లు ఏమైనా ఖ‌ర్చు చేశానా..? జ‌గ‌న్ అంటూ ప్ర‌శ్నించారు లోకేష్. లోకేష్ ప‌ర్య‌ట‌న కోసం ప్ర‌భుత్వ ధ‌నం ఒక్క రూపాయి ఖ‌ర్చు చేయ‌లేద‌ని ఇప్ప‌టికే ఏపీ ప్యాక్ట్ చెక్ స్ప‌ష్టం చేసింది.

I watched the match with my money.. Jagan Ki Lokesh Satire
మ‌రోవైపు ఇటీవ‌ల‌ మైక్రోసాప్ట్ ఫౌండ‌ర్ బిల్ గేట్స్ అపాయింట్ మెంట్ కోసం పాల‌కులు చాలా మంది ఎదురుచూస్తుంటారు. కానీ ఆయ‌న ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి ప్ర‌త్యేక విమానంలో వ‌చ్చారు. సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో దాదాపు మూడు గంట‌లు గ‌డిపారు. టెక్నాల‌జీ ఉప‌యోగించుకొని ప్ర‌భుత్వం చేస్తున్న‌టువంటి ప‌నుల‌ను ఆయ‌న‌కు విరించారు. బిల్ గేట్స్ అమ‌రావ‌తికి వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న‌కు ఇచ్చిన టీ, కాఫీలు, స‌మోసాలు, కార్లు, హోట‌ల్, ఫ్లైట్ కోసం ఎంత ఖ‌ర్చు పెట్టిందో వివ‌రాలు బ‌య‌ట‌పెట్టాల‌ని వైసీపీ నేత‌లు డిమాండ్ చేశారు. వైసీపీ నేత‌లు బిల్ గేట్స్ గురించి ప్ర‌శ్నించ‌డం ప్ర‌జ‌లు న‌వ్వుకోవ‌డం విశేషం.