Mohammed Siraj: ట్రావిస్ హెడ్‌తో గొడవ.. సిరాజ్‌పై ICC చర్యలు ?


Mohammed Siraj: ట్రావిస్ హెడ్ ను మహమ్మద్ సిరాజ్ ఎగతాళి చేశాడని కొందరు అంటున్నారు. కాదు సిరాజ్ ని ట్రావిస్ హెడ్ ఎగతాళి చేశాడని మరికొంతమంది అంటున్నారు. ఇదే అంశం పైన తాజాగా సిరాజ్ స్పందించారు. ట్రావిస్ హెడ్ బౌలింగ్ చేయడానికి చాలా ఎంజాయ్ చేశానని సిరాస్ చెప్పాడు. అతను మంచి బ్యాటర్ అని మెచ్చుకున్నాడు. గ్రౌండ్ లోను ఇద్దరి మధ్య యుద్ధం నడుస్తుందని సిరాజ్ అన్నాడు. అద్భుతమైన బాల్ ను సిక్స్ కొడితే ఎవరికైనా బాధ అనిపిస్తుందని చెప్పాడు. Mohammed Siraj

ICC punishes Mohammed Siraj, Travis Head for ugly Adelaide spat

కాకపోతే ఆ తర్వాత బంతికి బ్యాటర్ అవుట్ అయితే మంచి మజా వస్తుందని సిరాజ్ అన్నాడు. సహజంగానే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుందని అన్నాడు. ట్రావిస్ హెడ్ అవుట్ అయిన సమయంలో నేనేమీ మాట్లాడలేదని సిరాజ్ చెప్పాడు. కేవలం సంబరాలు మాత్రమే చేసుకున్నానని అన్నాడు. దీనిపై ట్రావిస్ హెడ్ మాత్రం అబద్ధాలు చెప్పాడని అన్నాడు. వెల్ బౌల్డ్ అన్నానంటూ హెడ్ చెప్పడంలో ఎలాంటి నిజం లేదని అన్నాడు. ట్రావిస్ ప్రవర్తించిన తీరు తప్పేనని అన్నాడు. Mohammed Siraj

Also Read: Virat Kohli: ప్రతి రోజు అదే పని… కోహ్లీ ఫిట్నెస్ పై అనుష్క కామెంట్స్ ?

కాగా ఈ విషయంపైన ట్రావిస్ హెడ్ మాట్లాడుతూ తనకు ఎవరిని అగౌరవ పరచాలని లేదని ఇక సిరాజ్ తో ఫైట్ బాగుంటుందని ట్రావిస్ హెడ్ చెప్పుకొచ్చాడు. క్రీజులోకి వచ్చిన సమయంలో తనతో మాట్లాడినట్లుగా గుర్తు చేసుకున్నాడు. సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే సమస్య వచ్చిందని ట్రావిస్ అన్నాడు. ఈ ఎపిసోడ్ నుంచి బయటకు వచ్చేస్తామని ట్రావిస్ చెప్పాడు. కాగా, ట్రావిస్ హెడ్ సిరాజ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నందున ఈ ఘటనలో సిరాజ్ ఐసీసీ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లుగా గుర్తించారు. దీంతో మ్యాచ్ ఫీజులో 20% జరిమానాను విధించాలని నిర్ణయం తీసుకున్నారు. హెడ్ కూడా రూల్స్ ను క్రాస్ చేశాడని తేలడంతో ఇద్దరు ఆటగాళ్లు తమ క్రమశిక్షణ రికార్డులపై ఒక్కో డీమెరిట్ పాయింట్స్ పొందారు. Mohammed Siraj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *