Babu Mohan: బాబు మోహన్ ఉంటే మేము నటించం..కోట, బ్రహ్మీ షాకింగ్ కామెంట్స్.!

Babu Mohan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ పాత్రలు అంటే చాలామందికి గుర్తుకు వచ్చేది బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ మాత్రమే.. ఈ ముగ్గురు ఇంచుమించు ఒకే తరం నటులు..ఇక ఈ ముగ్గురు నటులు నటించడంలో ఒకరిని మించి ఒకరు ఎక్కువ అని చెప్పవచ్చు.ఒకానొక సమయంలో బాబు మోహన్ ను నటనను చూసి చివరికి బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావే తగ్గిపోయారట. దీనికి కారణం ఏంటి వివరాలు చూద్దాం..

 If Babu Mohan is there we will not act Kota Brahmi shocking comments

If Babu Mohan is there we will not act Kota Brahmi shocking comments

బాబు మోహన్ కేవలం సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఆయన ఎప్పుడైతే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారో అప్పుడే సినిమాలను చేయడం మానేశారు. అలాంటి బాబు మోహన్ కు అత్యంత ఆదరణ లభించిన సినిమాల్లో ఆహుతి, అంకుశం సినిమాలు ఉన్నాయి. నంది అవార్డు కూడా దక్కించుకున్నారు.. అయితే ఇదే సమయంలో బాబు మోహన్ తో స్టార్ హీరోయిన్ సౌందర్య కూడా చినుకు చినుకు అందెలతో అనే సాంగ్ పై డ్యాన్స్ చేయడం అప్పట్లో పెద్ద సంచలనం.(Babu Mohan)

Also Read: Abhinaya: పెళ్లి పీటలెక్కబోతున్న అభినయ.. ఆ అదృష్టవంతుడు ఎవరంటే.?

ఈ పాటకి అద్భుతమైన ఆధారణ లభించడంతో బాబు మోహన్ డాన్స్ కూడా చేయగలరని నిరూపించుకున్నాడు..ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సౌందర్య నాతో డాన్స్ చేస్తే కెరియర్ పోతుందని అందరూ అన్నారు. కానీ ఆమె భయపడకుండా నాతో చేయడం అదృష్టవని భావించి ఆ ఒక్క పాటకు డాన్స్ చేసింది. తర్వాత ఆమె కెరియర్ మారిపోయిందని చెప్పుకొచ్చారు.

 If Babu Mohan is there we will not act Kota Brahmi shocking comments

ఇదంతా పక్కన పెడితే ఒకానొక టైం లో బాబు మోహన్ చిత్రాల్లో నటిస్తే ఆ సినిమాల్లో మేము చేయమని బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు తెగేసి చెప్పారట.. వెంటనే రాజేంద్రప్రసాద్, దాసరి నారాయణరావు కలగజేసుకొని మీ ముగ్గురు సినిమాలో ఉంటే అది అద్భుతమైన హిట్ అవుతుంది అలాంటి మీరు కలిసిన నటించకుంటే సినిమా వేస్ట్ అంటూ ఆ ముగ్గురి కాంబినేషన్ సెట్ చేసి మరీ సినిమాలు వచ్చేలా చేశారట.(Babu Mohan)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *