IND VS NZ: ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ టై అయితే.. విజేత ఎవరు?
IND VS NZ: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా.. ఆదివారం అంటే మార్చి 9వ తేదీన న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా బిగ్ ఫైట్ జరగనుంది. ఈ మెగా ఫైనల్ దుబాయ్ వేదికగా జరగనుంది. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటినుంచే టీమిండియా అలాగే న్యూజిలాండ్ ప్లేయర్లు కసరత్తులు చేస్తున్నారు.

If the Champions Trophy final match is tied, who will be the winner IND VS NZ
అయితే న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా నిలుస్తుందని కొంతమంది చెబుతున్నారు. ఒకవేళ వర్షం కురిసి మ్యాచ్ ఆగిపోతే రిజర్వ్ డే కూడా ఉంది. మొదటి రోజు ఎక్కడ మ్యాచ్ ఆగిపోయిందో తర్వాతి రోజు కూడా అక్కడి నుంచి ప్రారంభమవుతుంది.
ఇక రిజర్వ్ డే రోజు కూడా వర్షం కురిస్తే… ఇద్దరినీ విజేతలుగా ప్రకటిస్తారు. ఒకవేళ మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ ఆడాల్సి ఉంటుంది. ఈ సూపర్ ఓవర్ లో ఫలితం వచ్చేవరకు రెండు జట్లు వాడాలి. అప్పుడు విజేత ఎవరో క్లారిటీ వస్తుంది.