Brahmi: బ్రహ్మి ఆకులు ప్రయోజనాలు తెలుస్తే.. ఎగబడతారు ?


Brahmi: బ్రహ్మీ లేదా సరస్వతి ఆకులు ఇవి చాలామందికి తెలియదు. కానీ దీనివల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఈ ఆకులకు సర్వరోగాలను నయం చేసే శక్తి సామర్థ్యం కలదు. సరస్వతి ఆకులు క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్, శ్వాసకోశ లాంటి అనేక రకాల సమస్యలను నివారిస్తాయి. ఈ చెట్టు చేసే ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం….ఆయుర్వేదంలో ఈ మూలికకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఈ ఆకులు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బ్రహ్మీ ఆకులు మానసిక ఆందోళన, ఒత్తిడిని తగ్గించే శక్తి కలదు. మెమొరీ బూస్టర్ అని ఈ చెట్టుకు పేరు కలదు. దీన్ని తీసుకున్నట్లయితే ఙ్ఞాపకశక్తి పెరుగుతుంది. నిద్రలేమి సమస్యలు తొలగిపోతాయి.

If you know the benefits of Brahmi leaves

ఈ చెట్టు జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాలేయ సంబంధిత సమస్యలను తొలగించి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఈ చెట్టు ఎంతో మేలు చేస్తుంది. ఈ చెట్టు అస్తమా, మూర్చలాంటి వ్యాధులను పూర్తిగా నయం చేస్తుంది. బ్రహ్మీ చెట్టు క్యాన్సర్ ప్రమాదాలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చెట్టు చాలా ప్రభావవంతమైనది. డయాబెటిస్ లాంటి సమస్యలను నిర్మూలించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మనసును ప్రశాంతంగా ఉంచడానికి సరస్వతి చెట్టు ఎంతగానో సహాయం చేస్తుంది. ఈ చెట్టు మానసిక ప్రశాంతతను, ఆరోగ్యాన్ని, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకు రెండుసార్లు ఈ బ్రహ్మీని సేవించడం వల్ల ఎన్నో రకాల లాభాలు శరీరానికి చేకూరుతాయి. రక్తపోటుని సైతం తగ్గించే గుణం ఈ చెట్టుకు ఉంది. ఆయుర్వేద వైద్యంలో జుట్టు సమస్యలను నివారించడానికి ఈ చెట్టును ఎంతగానో వాడుతూ ఉంటారు.

Anirudh: అనిరుద్ కి మరో ఆల్టర్నేట్ దొరికేసినట్లేనా?

జుట్టు రాలడం, జుట్టు పొడవుగా, ఒత్తుగా మారుతుంది. ఈ చెట్టును ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలు, చర్మ సమస్యలు సైతం తొలగిపోతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఏమైనా గాయాలు ఉన్నట్లయితే సరస్వతి చెట్టు ఆకులను పేస్ట్ చేసి పెట్టుకున్నట్లయితే గాయాలు తొందరగా మానుతాయి. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులకు సైతం ఈ చెట్టు ఎంతగానో సహాయం చేస్తుంది. నేటి కాలంలో కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పుల సమస్యలు అధికమవుతున్నాయి. అలాంటివారు దీనిని వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్న పిల్లలకు సరస్వతి ఆకులతో తయారు చేసిన లేహ్యాన్ని తినిపించినట్లైతే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మెదడు పొడిబారడం, మొద్దు బారడం లాంటి సమస్యలు తొలగిపోతాయి. చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటారు.

Allu Arjun film: అల్లు అర్జున్ ను అవమానించే విధంగా యాంటీ ఫ్యాన్స్ పోస్ట్ లు..ఇలా తయ్యారయ్యరెంట్రా!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *