Winter: చలికాలంలో చాలామందికి నీరసం, బద్ధకం వస్తుంది. అయితే నీరసానికి, బద్ధకానికి కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల వాటికి చెక్ పెట్టవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అందులో ముఖ్యంగా బీట్రూట్ తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఇందులో పొటాషియం, జింక్, మెగ్నీషియం, మాంగనీస్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. శీతాకాలంలో ఎలాంటి సందేహం లేకుండా అరటి పండ్లను తప్పకుండా తినాలి. Winter

If you take this food in winter, check 100 diseases

ఇందులో విటమిన్లు బి-6, కార్బోహైడ్రేట్లు ఉన్నందున శరీరానికి శక్తి లభిస్తుంది. కోడిగుడ్లు కూడా శీతకాలంలో తినాల్సిన ఆహారంగా చెప్పవచ్చు. ఇందులో విటమిన్ బి12, విటమిన్ ఏ, కాల్షియం, ప్రోటీన్లు, అమినో యాసిడ్స్ వంటివి విపరీతంగా ఉంటాయి. గుడ్డు తినడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. Winter

ALSO READ: Shikhar Dhawan – NPL 2024: నేపాల్‌ కు వెళ్లిపోతున్న శిఖర్ ధావన్ ?

శీతాకాలంలో చాలావరకు డ్రై ఫ్రూట్స్ తినడం చాలా మంచిది. వీటిని తినడం వల్ల శరీరంలో ఎనర్జీ పెరుగుతుంది. అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. చాలామంది డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల విపరీతంగా బరువు పెరుగుతారని భ్రమలో ఉంటారు. కానీ డ్రైఫ్రూట్స్ తినడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. డ్రైఫ్రూట్స్ తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో ఏర్పడే అనేక రకాల వ్యాధుల నుంచి పోరాడుతుంది. Winter