Game Changer: గేమ్ ఛేంజర్ లో అప్పన్న పాత్ర ఆ హీరో చేయాల్సింది.. కానీ దగ్గరుండి చెర్రీ చెడగొట్టాడుగా.?

Game Changer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్లాప్ తెలియని డైరెక్టర్లలో శంకర్ మొదటి స్థానంలో ఉండేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఆయనకు ఏమైందో ఏమో ఆయన డైరెక్షన్ లో వచ్చిన ప్రతి సినిమా దారుణంగా ప్లాప్ అవుతుంది.. ఒకప్పుడు శంకర్ తో సినిమా అంటే హీరోలంతా పరుగులు పెట్టి మరి వచ్చేవారు. ఆయన డైరెక్షన్ లో ఒక్క సినిమా చేసిన చాలు అని వెయిట్ చేసేవారు. అలాంటి ఈ దర్శకుడు కాస్త తడబడ్డాడు.. అప్పట్లో ఆయన సినిమా చూస్తే ఏదో ఒక ఫీల్ కలిగేది.

In Game Changer Appanna character was supposed to be the hero

In Game Changer Appanna character was supposed to be the hero

ఇప్పటి సినిమాల్లో ఆ ఫీల్ ఇవ్వలేకపోతున్నాడు. ఈయన చేసినటువంటి ‘ఐ’ మూవీ అలాగే ఇండియన్ 2 దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. వీటి తర్వాత కాస్త కోలుకొని గేమ్ చేంజర్ తో కం బ్యాక్ ఇద్దామనుకున్నాడు. కానీ ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిందని చెప్పవచ్చు. కానీ ఈ సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందట. గేమ్ చేంజర్ అప్పన్న క్యారెక్టర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ పాత్రలో రామ్ చరణ్ నటించడం కాదు జీవించేశారట. (Game Changer)

Also Read: Dil Raju: దిల్ రాజు అనిల్ రావిపూడి ఆఫీస్ లో ఐటి సోదాలు.. వాళ్ల కుట్రేనా..?

ఇందులో నత్తి క్యారెక్టర్ లో ఈయన నటన ప్రతి ఒక్కరిని ఆకట్టుకుందట. ఈ క్యారెక్టర్ కాస్త పెంచి ఉంటే మాత్రం సినిమా హిట్ అయ్యేదని నేటిజన్స్ అంటున్నారు. అంతేకాకుండా ఈయన మధ్య వయసు ఉన్న రాజకీయ నాయకుడి క్యారెక్టర్ కూడా అందరిని మెప్పించిందట. ఈ పాత్రను ముందుగా చిరంజీవితో చేయించాలని అనుకున్నారట శంకర్. కానీ ఆ పాత్రను నేను చేయగలనని కాన్ఫిడెన్స్ ఇచ్చారట రామ్ చరణ్.

In Game Changer Appanna character was supposed to be the hero

ఆయన మాట ప్రకారమే అందులో నటించడం కాదు జీవించేసారట. ఈ పాత్రను తెరపై చూస్తున్నంత సేపు అభిమానులు కళ్ళు తిప్పకుండా చూశారట. అంతేకాదు ఈ పాత్ర సమయంలో వచ్చినటువంటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా సెట్ అయిందని, ఈ పాత్రను ఏ విధంగా చిత్రీకరించారో ఆ విధంగానే సినిమా మొత్తం మైంటైన్ చేసి ఉంటే సినిమా మొత్తం సూపర్ హిట్ అయ్యేదని అంటున్నారు. కానీ ఆ రెండు క్యారెక్టర్లు తప్ప సినిమా మొత్తాన్ని పోగొట్టేశారు డైరెక్టర్ శంకర్. రామ్ చరణ్ ను ఆయన పూర్తిగా వాడుకోలేకపోయారు. దీంతో రామ్ చరణ్ ఖాతాలో మరొకటి డిజాస్టరుగా నిలిచింది.(Game Changer)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *