Champions Trophy 2025: షమీ ఈజ్ బ్యాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత జట్టు ఇదే
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టును ప్రకటించారు. ఈ మేరకు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటన చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ పునరాగమనం చేయగా, జస్ప్రీత్ బుమ్రా కూడా వస్తున్నాడు. రోహిత్ శర్మ డిప్యూటీగా శుభ్‌మాన్ గిల్ ఉండనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025, ఇంగ్లండ్ వన్డే సిరీస్‌లకు రిషబ్ పంత్, కెఎల్ రాహుల్ ఇద్దరు వికెట్ కీపర్‌లుగా ఉంటారు.
india squad for champions trophy 2025
లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కు అవకాశం రావడంతో పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కలేదు. ఈ టోర్నీలో రెండు చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా అతిపెద్ద మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో భారత్ తన ప్రారంభ మ్యాచ్ ఆడనుంది. భారత్ చివరి లీగ్ మ్యాచ్ మార్చి 2న న్యూజిలాండ్‌తో జరగనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్ (విసి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్), రిషబ్ పంత్ (వికె), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా*, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, యశస్వి జైస్వాల్