Ind vs Aus: ఆసీస్ కు షాక్.. సెమీస్ లో ఐదుగురు స్పిన్నర్లతో టీమిండియా ప్లాన్ ?
Ind vs Aus: ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ఇవాళ సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సెమీఫైనల్ మొదటి మ్యాచ్ లో టీమిండియా అలాగే ఆస్ట్రేలియా జట్టు తలపడబోతున్నాయి. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభం కాబోతున్న… ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగునుంది.

India vs Australia semi-final, Champions Trophy 2025
దుబాయిలో రేపు వర్షం కూడా పడటం లేదు. ఒకవేళ వర్షం పడిన రిజర్వుడే ఉంటుంది. అయినప్పటికీ… మ్యాచ్ రద్దు అయితే ఆటోమేటిక్ గా… పాయింట్స్ టేబుల్ లో మొదటి స్థానంలో టీమిండియా ఉంది కాబట్టి ఫైనల్ కు వెళ్తుంది.
అయితే రేపు ఆస్ట్రేలియాను ఢీకొట్టేందుకు ఏకంగా ఐదుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతోందట టీమిండియా. దుబాయ్ పీచ్ మొత్తం స్పిన్నర్లకు అనుకూలిస్తున్న నేపథ్యంలో… ఈ నిర్ణయం తీసుకున్నాడట రోహిత్ శర్మ. స్పిన్నర్లతో ఆస్ట్రేలియాను ఢీ కొట్టి ఫైనల్ కి వెళ్లాలని ప్లాన్ వేశారట.