IPL 2025: ఐపీఎల్ ఆడే టీం ఇండియా ప్లేయర్లకు బీసీసీఐ బిగ్ షాక్..?


IPL 2025: ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ఆడేటువంటి ప్లేయర్లకు ఊహించని షాక్ ఇచ్చింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. కచ్చితంగా రెడ్ బాల్ పైన ప్రాక్టీస్ చేయాలని… టీమిండియా ప్లేయర్ లందరికీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ సంవత్సరం జూన్ నుంచి జూలై మధ్యలో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే.

Indian players to multitask during IPL, engaging in red-ball preparations as BCCI aims for a Test cricket revival ahead of the England tour

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ పూర్తికాగానే ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ జరుగుతున్న రెండు నెలలపాటు… జాబ్ దొరికినప్పుడల్లా రెడ్ బాల్ తో ప్రాక్టీస్ కూడా చేయాలని… భారత క్రికెట్ నియంత్రణ మండలి హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో టెస్టుల్లో టీమిండియా దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. స్వదేశంలో న్యూజిలాండ్ అలాగే విదేశంలో ఆస్ట్రేలియా చేతిలో దారుణంగా ఓడిపోయింది టీమిండియా. అందుకే టీమిండియా రెడ్ బాల్ తో ఆడాలని… బీసీసీఐ సూచించిందట. ఈ మేరకు… స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చిందట. దీనికి సంబంధించిన న్యూస్ జాతీయ మీడియాలో వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *