Jasprit Bumrah: IPL మెగా వేలంలో బుమ్రాకు రూ. 520 కోట్లు ?

INR 520 Crore Purse For Jasprit Bumrah Ashish Nehra Reveals

Jasprit Bumrah: ఐపీఎల్ 2025 మెగా వేలం పూర్తయింది. ఇందులో రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ వారి పాత రికార్డులను బద్దలు కొట్టారు. పంత్ లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లకు కొనుగోలు చేసి ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అయితే శ్రేయస్ అయ్యర్ కోసం పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లను వెచ్చించింది. దీంతో పంత్ తర్వాత అయ్యర్ రెండవ స్థానంలో నిలిచాడు. Jasprit Bumrah

INR 520 Crore Purse For Jasprit Bumrah Ashish Nehra Reveals

ఇటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరి మధ్యలో ఒకే ఒక ప్రశ్న మెదులుతూ ఉంటుంది. టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వేలంలోకి వచ్చినట్లయితే అతనికి ఎంత డబ్బులు వచ్చేవంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. దీనికి గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా సరదాగా సమాధానం ఇచ్చాడు. రూ. 520 కోట్ల బడ్జెట్ కూడా వేలంలో బుమ్రాకు తక్కువే అంటూ ఓ ఇంటర్వ్యూలో సరదాగా చెప్పుకోచ్చారు. Jasprit Bumrah

Also Read: Rishabh Pant: ఏకంగా 16 కేజీలు తగ్గిన రిషబ్ పంత్ ?

ఈ మాట చెప్పి ఒక్కసారిగా ఆశిష్ నవ్వాడు. అనంతరం మాట్లాడుతూ 520 కోట్లు కాదు జస్ప్రీత్ బుమ్రా ఈజీగా రూ. 30 కోట్ల వరకు రాబట్టగలరు. అయితే ముంబై ఇండియన్స్ అతడిని రూ. 18 కోట్లకు రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే. జస్ప్రీత్ బుమ్రా తన ఐపిఎల్ అరంగేట్రం నుంచి ముంబై ఇండియన్స్ లోనే ఉన్నాడు. అప్పటినుంచి అతను ఒక్కసారి కూడా వేలంలోకి రాలేదు. అయితే తొలిసారిగా ముంబైకి అత్యంత ఖరీదైన ఆటగాడిగా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. Jasprit Bumrah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *