Ipl 2025: ఇవాల్టి నుంచి విశాఖలో ఐపీఎల్ 2025 టికెట్లు !
Ipl 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ త్వరలోనే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయ్యాయి. ఈనెల 22వ తేదీ నుంచి.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్లు విడుదలవుతాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు అయింది. అటు 10 జట్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఆడేందుకు సిద్ధమయ్యాయి.

IPL 2025 tickets available in Visakhapatnam from today
ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధిం చిన కీలక అప్డేట్ వచ్చింది. విశాఖపట్నంలో ఐపీఎల్ సందడి ప్రస్తుతం జోరు జోరుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 24వ తేదీన ఢిల్లీ వర్సెస్ లక్నో మధ్య… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ వర్సెస్ లక్నోకు ఇదే ఈ సీజన్లో మొదటి మ్యాచ్. ఢిల్లీకి ఢిల్లీ గ్రౌండ్ తో పాటు… విశాఖ కూడా హోమ్ గ్రౌండ్ గా ఉంది. అయితే 24వ తేదీన జరగాల్సిన… విశాఖపట్నం ఐపీఎల్ మ్యాచ్… కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 24వ తేదీన జరగాల్సిన ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను ఇవాళ ఆన్లైన్లో అమ్మనున్నారు.
ఈ మేరకు ఇవాళ సాయంత్రం 4:00 నుంచి డిస్ట్రిక్ట్ యాప్ లో… ఈ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ సీజన్లో విశాఖపట్నం ను తన సెకండ్ హోమ్ గ్రౌండ్ గా ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. తమ తొలి మ్యాచ్ ఇక్కడ ఆడబోతుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఈనెల 30వ తేదీన ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ టికెట్లు ఎప్పటి నుంచి అమ్ముతారా అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇవాళ అయితే మొదటి ఐపీఎల్ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు విడుదలవుతాయి. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజెస్ బెంగళూరు… మధ్య ఫైట్ జరగనుంది.