Allu Arjun: అట్లీ సినిమాకి అల్లు అర్జున్ సరికొత్త సంచలనం..?

Allu Arjun: అల్లు అర్జున్ క్రేజ్ పుష్ప టు సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పాకింది. ముఖ్యంగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బాహుబలి 2 వంటి సినిమాని కలెక్షన్స్ లో బీట్ చేసి దంగల్ సినిమా కలెక్షన్స్ కి దరిదాపుల్లోకి వెళ్ళింది. అలా ఈ సినిమాతో ఎంత పేరైతే వచ్చిందో అన్ని వివాదాల్లో ఇరుక్కున్నారు. ఇదంతా పక్కన పెడితే పుష్ప-2 సినిమాకి అల్లు అర్జున్ ఏకంగా 300 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు వార్తలు వినిపించాయి.
Is Allu Arjun the new sensation for Atlee movie
అది నిజమే అన్నట్లుగా అల్లు ఫ్యామిలీతో ఎంతో సన్నిహితంగా ఉండే బన్నీ వాసు కూడా పరోక్షంగా స్పందించారు. అయితే తాజాగా అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో ఒక సినిమా చేయబోతున్నట్టు రూమర్ లు వినిపిస్తున్నాయి. అయితే ఇవి రూమర్లు కాదు నిజమే ఎందుకంటే సన్ పిక్చర్స్ బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కబోతుంది. (Allu Arjun)
Also Read: Krishnam Raju: ఆ హీరోయిన్ బట్టలు విప్పి కుక్కని మీదికి పంపిన కృష్ణంరాజు.?
అయితే ఈ మూవీ షూటింగ్ అక్టోబర్లో సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్లు సమాచారం. అయితే తాజాగా అట్లీ అల్లు అర్జున్ కాంబోలో రాబోయే సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా 175 కోట్ల పారితోషికాన్ని తీసుకోబోతున్నట్టు వార్తలు కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు సినిమా హిట్ అయితే సినిమా లాభాల్లో దాదాపు 15% ఇవ్వాలని సన్ పిక్చర్స్ తో అల్లు అర్జున్ ఒప్పందం కూడా కుదుర్చుకున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి.

ఒకవేళ ఇదే నిజమైతే అల్లు అర్జున్ రెమ్యూనరేషన్లో నార్త్ హీరోలను కూడా బీట్ చేస్తూ సరికొత్త సంచలనం సృష్టిస్తారని తెలుస్తోంది.అలాగే అట్లీ కాంబోలో రాబోతున్న సినిమాలో అల్లు అర్జున్ ద్విపత్రాభినయం చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ విలన్ గా అలాగే హీరోగా రెండు పాత్రల్లో చేస్తారని సమాచారం.(Allu Arjun)