Deepika Padukone: బాలీవుడ్ నటి దీపిక పదుకొనే నిజంగానే ప్రెగ్నెన్సీ కాదా..ఆమెది ఫేక్ గర్భమా.. సరోగసి ద్వారా పిల్లల్ని కనబోతుందా.. సరోగసి అయితే ఈ విషయాన్ని చెప్పొచ్చు కదా ఎందుకు అలా సీక్రెట్ గా ఉంచుతోంది అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ లేడీ డాక్టర్ కూడా దీపిక పదుకొనే ప్రెగ్నెన్సీ పై అనుమానం వ్యక్తం చేసింది. మరి ఇంతకీ ఆమె ఎవరు..దీపిక ప్రెగ్నెన్సీ పై ఆమెకు వచ్చిన అనుమానం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
Is Deepika Padukone pregnancy real or reel
ప్రముఖ ivf నిపుణురాలు డాక్టర్ గౌరీ అగర్వాల్ దీపిక ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూ.. దీపిక ప్రెగ్నెన్సీ పొట్టపై చాలా అనుమానాలు ఉన్నాయి. అలాగే ప్రెగ్నెన్సీ అయితే చాలామంది మోహంలో మార్పులు వస్తాయి.అలాగే శరీరంలో కూడా భారీ మార్పులు ఉంటాయి.లావు పెరిగిపోతారు. కానీ దీపిక మాత్రం ఎప్పటిలాగే ఉంది. ఇక బాలీవుడ్ లో చాలామంది ఏజ్ మీద పడ్డాక పిల్లల్ని కనడానికి ivf, సరోగసి సహాయం తీసుకుంటారు.కాని దీపిక పడుకునే ప్రెగ్నెన్సీలో ఏం జరుగుతుంది అనేది తెలియడం లేదు. (Deepika Padukone)
దీపికకు ఇప్పుడు 38 సంవత్సరాలు. ఇలాంటి సమయంలో పిల్లల్ని కనడానికి అంతగా ఆస్కారం లేదు. అయితే ఆరోగ్యంగా ఉన్న స్త్రీ 45 సంవత్సరాల వరకు పిల్లల్ని కనవచ్చు.దీపిక పదుకొనే బేబీ బంప్ ని చూస్తే కాస్త అనుమానం కలుగుతుంది. ప్రెగ్నెన్సీ పొట్ట అలా ఉండదు. అలాగే చాలామంది హీరోయిన్లు ప్రెగ్నెన్సీ వల్ల మొహంలో మార్పులు,శరీరంలో మార్పులు వస్తాయి. కాబట్టి ఐవీఎఫ్,సరోగసి వంటివి ఎంచుకుంటున్నారు.
కానీ దీపిక ప్రెగ్నెన్సీ పొట్టపై మాత్రం చాలా అనుమానాలు ఉన్నాయి.. అంటూ ఐవీఎఫ్ నిపుణురాలు గౌరీ అగర్వాల్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంతో దీపిక పదుకొనే గర్భం కృత్రిమందా.. లేక నిజమైనదా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అనుమానం ఇంతకుముందే ఓసారి వినిపించినప్పటికీ దాన్ని కొంతమంది కొట్టి పారేశారు.(Deepika Padukone)