Anchor: సీఎం పేరు మర్చిపోయిన యాంకర్ జైలుకు వెళ్లడం ఖాయమేనా.?
Anchor: ఆ మధ్యకాలంలో పుష్పటు సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ తెలంగాణ ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి పేరు చెప్పడంలో తడబడ్డారు. దీంతో కాస్త వాటర్ తాగి గొంతు ఎండుకు పోయింది అని కవర్ చేసి మళ్ళీ రేవంత్ రెడ్డి పేరు తీశారు. అయితే ఆ తర్వాత వెంటనే సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళా మృతి చెందడంతో అల్లు అర్జున్ పై కేసు నమోదు అయింది. ఇక రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన వెంటనే అల్లు అర్జున్ నీ పోలీసులు అరెస్టు చేయడంతో రేవంత్ రెడ్డే ఈ పని చేయించారు అనే ప్రచారం మీడియాలో జరిగింది.
Is it certain that the Anchor who forgot the CM name will go to jail
అయితే ఇందులో తన తప్పేమీ లేదని, చట్టం దృష్టిలో అందరూ సమానులే అని,చట్టం తన పని తాను చేస్తుందని,కానీ చాలామంది నేనే అరెస్టు చేయించారని నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు.నేనెందుకు ఆయనను అరెస్టు చేయిస్తాను. చిన్నప్పటి నుండి రాంచరణ్ బన్నీలు నాకు తెలుసు అంటూ రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఈ విషయం పక్కన పెడితే.. (Anchor)
Also Read: Trisha: సీఎం అవ్వాలంటున్న త్రిష.. మామూలు ట్రిస్ట్ ఇవ్వలేదుగా.?
తాజాగా జరిగిన ఓ ఈవెంట్ కి రేవంత్ రెడ్డి హాజరవ్వగా ఆ ఈవెంట్ కి యాంకర్ గా చేసిన నటుడు యాంకర్ అయినటువంటి బాలాదిత్య రేవంత్ రెడ్డి పేరును మర్చిపోయి ఆయన వస్తుండగా ఇక్కడికి విచ్చేసిన గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి అని చెప్పకుండా గౌరవ శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారి గా అరిచారు. దాంతో వెంటనే పక్కకు వెళ్లి మళ్లీ సరి చేసుకొని వచ్చి సారీ రేవంత్ రెడ్డి గారు అని చెప్పారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ‘
అయితే తాజాగా హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమైక్య మహాసభలకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు.ఆ సమయంలో రేవంత్ రెడ్డి పేరుని పలకకుండా కిరణ్ కుమార్ రెడ్డి అని బాలాదిత్య చెప్పడంతో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు వీడియో కింద పేరు మర్చిపోయిన అల్లు అర్జున్ అరెస్టు అయ్యాడు. ఇప్పుడు పేరు మర్చిపోయి వేరే సీఎం పేరు చెప్పిన బాలాదిత్య కూడా జైలుకైనా అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.(Anchor)