Carrots and Beetroot: క్యారెట్, బీట్రూట్ కలిపి జ్యూస్ తాగితే.. ఆ రోగాలకు చెక్ ?
Carrots and Beetroot: దుంప జాతికి చెందిన క్యారెట్, బీట్రూట్ లో అధికంగా పోషకాలు ఉంటాయి. ఈ రెండింటి కలయికలో జ్యూస్ తయారు చేసుకుని తాగినట్లయితే ఆరోగ్యానికి ఎన్నో రకాల పోషకాలు చేకూరుతాయి. క్యారెట్, బీట్రూట్ కలిపి జ్యూస్ చేసుకొని తాగినట్లయితే శరీరానికి ఎనర్జీ వస్తుంది ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఈ రెండింటిలో లభించే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కీళ్ల వాపుల సమస్యలు తొలగిపోతాయి.
Is it good to eat carrot and beetroot together
ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు రావు. బీట్రూట్, క్యారెట్ లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. దానివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. బీట్రూట్, క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఉండే చెడు బ్యాక్టీరియా తొలగిపోతుంది. ఇందులోని పోషకాలతో పాటు విటమిన్ ఏ, విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఇందులో సహజమైన డీటక్స్ ఉండడం వల్ల కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. చర్మం కాంతివంతంగా తయారవుతుంది. జుట్టు ఊడడం సమస్యలు తొలగిపోతాయి. బీట్రూట్, క్యారెట్ కలిపి జ్యూస్ తాగినట్లయితే శరీరంలో రక్తం పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. వారంలో రెండు మూడు సార్లు అయినా బీట్రూట్ క్యారెట్ కలిపి జ్యూస్ చేసుకుని తాగాలని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతిరోజూ తాగినట్లయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.