Vastu Tips: ఇంట్లోకి గుడ్ల గుబ వస్తే లాభమా ?


Vastu Tips: ఇళ్లలోకి పక్షులు, కీటకాలు రావడం చాలా సహజం. ముఖ్యంగా పల్లెటూర్లలో పక్షులు, కీటకాలు ఇంట్లోకి రావడం ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాలలో అనేక రకాల పక్షులు ఇంట్లోకి వస్తూ పోతూ ఉంటాయి. అయితే కొన్ని రకాల పక్షులు ఇంట్లోకి రావడం వల్ల ఇంట్లో వారు బాగా భయపడతారు. ముఖ్యంగా గుడ్ల గుబ ఇంట్లోకి వచ్చిందంటే చాలు ఏదో అశుభం జరుగుతుందని చాలామంది భయానికి లోనవుతూ ఉంటారు. ఎందుకంటే గుడ్లగూబ చాలా భయంకరంగా ఉంటుంది. ఇంట్లో మాత్రమే కాదు ఎక్కడైనా చెట్ల పైన గుడ్లగూబ కనిపించిన కూడా ప్రతి ఒక్కరూ భయపడటం చాలా కామన్.

Is it good to have an eggshell in your house

మరి గుడ్లగూబ ఇంట్లోకి రావడం మంచిదా కాదా అనే విషయంలో పండితులు కొన్ని విషయాలను వెల్లడించారు. ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. గుడ్లగూబను చూడడం మాత్రమే కాదు అది ఎదురుగా వస్తే కూడా చాలామంది అశుభంగా భావిస్తూ ఉంటారు. దీనిని ఇంటి లోపలికి మాత్రమే కాదు ఇంటి బయట కూడా కనిపిస్తే తరుముతూ ఉంటారు. ఇక మరికొంతమంది ఇంట్లోకి గుడ్లగూబ ఇంట్లోకి వచ్చిందంటే ఆ ఇంటిని వదిలేసి మరో ఇంటికి వెళ్తారు. అయితే ఇదే విషయంపైన పండితులు క్లారిటీ ఇచ్చారు. గుడ్లగూబ ఇంట్లోకి వచ్చినట్లయితే సాక్షాత్తు మహాలక్ష్మి వచ్చినట్లేనని చెబుతున్నారు. గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. గుడ్లగూబ ఇంట్లోకి వచ్చినట్లయితే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని అర్థం చేసుకోవాలి.

Lucknow Super Giants: శార్దుల్ ఠాకూర్ కు లక్నో ఆఫర్ ?

ఇది శుభ సూచకం అని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా గుడ్లగూబ దీపావళి రోజున ఇంట్లోకి వస్తే చాలా మంచిది. ఇక ఆ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లో వచ్చి కూర్చున్నట్టేనని చెబుతున్నారు. చాలామంది దీపావళి రోజున గుడ్లగూబను చూసినట్లయితే లక్ష్మీదేవిని చూసినట్లేనని భావిస్తారట. ఇక ఇంట్లోకి వచ్చినట్లయితే చాలా సంతోషంగా ఉంటారట. మరి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చిందని భావిస్తారట. ఇక గుడ్లగూబను చూస్తే అశుభంగా భావించేవారు ఇకనుంచి అయినా శుభ సూచకంగా భావించినట్లయితే చాలా మంచి జరుగుతుందని పండితులు సూచనలు చేస్తున్నారు.

IPL 2025: ఐపీఎల్ లో పెన్షన్ పొందే ప్లేయర్లు లిస్ట్‌ ఇదే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *