Hardik Pandya-Janhvi: అందాల తారతో పాండ్యా రెండో పెళ్లి ?
Hardik Pandya-Janhvi: అందాల తార జాన్వి కపూర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి పరిచయమైంది. బాలీవుడ్ లో ధడక్ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈ చిన్నది అక్కడ పెద్దగా గుర్తింపు దక్కించుకోలేదు. అనంతరం తెలుగులో దేవర సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన దేవర సినిమా మంచి వసూళ్లను రాబట్టింది.
Is Janhvi Kapoor dating Hardik Pandya
తాజాగా ఈ బ్యూటీ మరో సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన హీరోయిన్గా అవకాశాన్ని అందుకుంది. అంతేకాకుండా తమిళంలో సూపర్ హిట్ అయిన ఈరం సినిమా హిందీ రీమేక్ లో హీరోయిన్ గా జాన్వి కపూర్ ఛాన్స్ కొట్టేసింది. 2009లో రిలీజ్ అయిన ఈ తమిళ సినిమాకు డైరెక్టర్ శంకర్ నిర్మాతగా వ్యవహరించారు. అరివలగన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కాగా, జాన్వి కపూర్, క్రికెటర్ హార్దిక్ పాండ్యా డేటింగ్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతుంది.
Gilchrist: రోహిత్ పై ఫైర్…ఇంటికి వెళ్లి నీ కొడుకు డైపర్లు మార్చుకో..?
అందుకు కారణం వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఓ ఫోటో వైరల్ అయింది. వీరిద్దరూ కలిసి ఇటీవలే మాల్దీవుల్లో విహరించినట్లుగా ఆ ఫోటోలు చూస్తే తెలుస్తోంది. జాన్వి కపూర్, హార్దిక్ పాండ్యా సముద్ర తీరంలో విహరిస్తూ సన్నిహితంగా కనిపించారు. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు హార్దిక్ పాండ్యా, జాన్వీ కపూర్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ ప్రచారాలు చేస్తున్నారు. అయితే ఈ ఫోటోలు ఏఐ ఫోటోలు అని సమాచారం అందుతోంది. ఈ వార్తలపై హార్దిక్ పాండ్యా, ఈ జాన్వి కపూర్ ఎవరో ఒకరు స్పందిస్తే గాని అసలు విషయం తెలియదు.