Naga Chaitanya: సమంత,శోభిత ఇద్దరూ కాదు.. నాగచైతన్యకి ఆ హీరోయినే లక్కీ.?
Naga Chaitanya: నాగచైతన్య జీవితంలోకి సమంత ఎంట్రీ ఇచ్చాక నాగచైతన్య జీవితానికి సమంతనే అదృష్టమని, ఆమె రాకతో నాగచైతన్య జీవితం మారిపోయింది అని ఎంతో మంది కామెంట్స్ చేశారు. కానీ ఆ తర్వాత సమంత నాగచైతన్యల మధ్య విభేదాలు వచ్చి విడిపోయారు.అలాగే నాగచైతన్య సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇక ఆ టైంలో ఎవరైతే సమాంతను మెచ్చుకున్నారో మళ్ళీ వాళ్లే సమంతను తిట్టి నాగచైతన్యకు సమంత దురదృష్టంలా పట్టుకుంది అని కామెంట్లు పెట్టారు.

Is Naga Chaitanya lucky to find that heroine
ఇక సడన్ గా శోభిత నాగచైతన్య జీవితంలోకి అడుగు పెట్టింది. ఇక శోభిత నాగచైతన్య లైఫ్ లోకి భార్యగా అడుగు పెట్టాక ఆయన చేసిన ఫస్ట్ మూవీ తండేల్..ఈ సినిమా హిట్ తో నాగచైతన్యకు శోభిత లక్కీ అని,చైతు కి శోభితేనే అదృష్టం అని,ఆమె రాకతోనే నాగచైతన్యకు తొలి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో పడబోతుంది అంటూ ఇలా చాలామంది కామెంట్లు పెడుతున్నారు.(Naga Chaitanya)
Also Read: Nagarjuna: “నా ఇంట్లో నుండి వెళ్లిపో”.. నాగచైతన్యకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున..కారణం.?
కానీ అక్కినేని అభిమానులు మాత్రం ఈ ఇద్దరినీ నాగచైతన్యకు అదృష్టంగా భావించడం లేదు.ఈ ఇద్దరు కాదు ఆ హీరోయినే నాగచైతన్యకు లక్కీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఆమె ఎవరో కాదు సాయి పల్లవి.. అవును మీరు వినేది నిజమే. నాగచైతన్యకు భారీ హిట్స్ ఇచ్చిన సినిమాల్లో లవ్ స్టోరీ ముందుంటుంది. ఈ సినిమా నాగచైతన్యకి మంచి హిట్ ఇచ్చింది.

ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా చేసిన సంగతి మనకు తెలిసిందే.అయితే తాజాగా విడుదలైన తండడేల్ మూవీ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో కూడా సాయి పల్లవినే హీరోయిన్గా చేసింది. అలా తండేల్ సినిమా హిట్ అయితే మాత్రం ఆ క్రెడిట్ సాయి పల్లవికే.అలా నాగచైతన్యకు సమంత శోభితలు కాదు సాయి పల్లవినే అదృష్టం అని చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.(Naga Chaitanya)