Prabhas: బిజినెస్ మ్యాన్ కూతురితో ప్రభాస్ పెళ్లి నిజమే.. వైరల్ అవుతున్న ఫొటోస్.?

Prabhas: ప్రభాస్ పెళ్ళంటూ గత 24 గంటల నుండి ఒక రూమర్ నెట్టింట్లో ఎంత వైరల్ అవుతుందో చెప్పనక్కర్లేదు. ప్రభాస్ హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మాన్ కూతురిని పెళ్లాడబోతున్నారని, ఈ వివాహ వేడుకలన్నింటిని ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి రహస్యంగా చేయిస్తున్నారని, ఎన్నో రూమర్లు తెరమీద వినిపిస్తున్నాయి. అయితే ఈ రూమర్లు నిజమే అనేలా తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇంతకీ ఆ ఫోటోలో ఉన్న నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.
Is Prabhas marriage with a businessman daughter true
ప్రభాస్ పెళ్ళంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి. కానీ అందులో ఏది నిజం కాలేదు.అయితే తాజాగా ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారని హైదరాబాద్ అల్లుడు కాబోతున్నారని పలు నేషనల్ వెబ్సైట్ లు బహిరంగంగానే రాసుకోచ్చాయి.అయితే ఈ పెళ్లి వార్తలను ప్రభాస్ కొట్టివేయకపోవడంతో చాలామంది ఇది నిజమే అనుకుంటున్నారు. ఇంకొంత మందేమో చాలా సార్లు ప్రభాస్ పెళ్లి పై రూమర్లు వినిపించాయి.(Prabhas)
Also Read: Heroine: రెండేళ్లలో 3000 కోట్లు..అద్దె ఇంట్లో అమ్మానాన్న.. హీరోయిన్ కన్నీటి కష్టాలు.?
అప్పుడు స్పందించలేదు ఇప్పుడు స్పందించట్లేదు అని లైట్ తీసుకుంటున్నారు.అయితే తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి తన ముగ్గురు కూతుర్లతో ఉన్న ఒక ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఆ ఫోటోలో నలుగురు పద్ధతిగా చీర కట్టుకొని చాలా అందంగా ముస్తాబై ఉన్నారు.అయితే ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొట్టడంతో ప్రభాస్ పెళ్లి వేడుకలను రహస్యంగా చేస్తున్నారని, ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇవే అంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ ఫోటోలు నిజమే కానీ ఈ ఫోటోలు రీసెంట్ గా ఓ పెళ్లికి వెళ్ళినప్పుడు ప్రభాస్ చెల్లెలు దిగిన ఫోటోలు. అయితే ప్రభాస్ పెళ్లి వార్తలు నిజమే అని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే రీసెంట్గా అన్ స్టపబుల్ షో కి వచ్చిన టైంలో ప్రభాస్ ఆంధ్రప్రదేశ్లోని గణపవరానికి చెందిన అమ్మాయిని పెళ్లాడబోతున్నారని వాళ్లు ప్రస్తుతం హైదరాబాదులోనే స్థిరపడ్డారని లీకులు వచ్చాయి.అయితే అది నిజమే కావచ్చు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు.(Prabhas)