Rajinikanth: రజినీకాంత్ కి పిచ్చి పట్టిందా..టాబ్లెట్స్ లేకపోతే ఉండలేడా..?
Rajinikanth: పాన్ ఇండియా సినిమాలు రాకముందే ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు రజనీకాంత్. ప్రస్తుతం ప్రతి ఒక్క హీరో పాన్ ఇండియా లెవెల్ లో దూసుకెళ్తున్నారు కానీ, వీళ్ళ కంటే ముందే రజనీకాంత్ ఆ క్రేజ్ సంపాదించారు. అలాంటి రజినీకాంత్ ఏడుపదుల వయస్సు దాటిన ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపు సాధిస్తున్నారు. ఆయన సినిమా వస్తుంది అంటే దేశ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఎదురు చూస్తారు. అలాంటి రజనీకాంత్ కు కాస్త పిచ్చి ఉందట.
Is Rajinikanth crazy Couldnot he be without tablets
ఈ విషయాన్ని నటుడు నాగబాబు ఒక సందర్భంలో తెలిపారు. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..రజనీకాంత్ అంటే నాకు ఎంతో అభిమానం. ఆయన ప్రస్తుతం వయసు మీద పడడంతో గుళ్ళు, గోపురాలు తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు. కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చాలా అగ్రెసివ్ గా ఉండేవారని, కోపాన్ని అస్సలు కంట్రోల్ చేసుకునే వారు కాదని చెప్పుకొచ్చారు. ఒకానొక టైంలో మా అన్నయ్య మెగాస్టార్ తో కూడా చాలా గొడవపడ్డాడని చెప్పారు. (Rajinikanth)
Also Read: Zainab: ఆ హీరో ని పెళ్లి చేసుకోవాల్సిన జైనబ్.. కానీ అఖిల్ కి భార్యగా.. ఎక్కడ చెడిందంటే.?
అలాగే ఒకసారి ఒక జర్నలిస్టు ఆయనపై రాసిన కథనానికి, ఆయన దగ్గరికి వెళ్లి కొట్టాడని, దీంతో పగ పెంచుకున్న జర్నలిస్టులు రజనీకాంత్ పై వరుసగా నెగిటివ్ కథనాలు రాసి ఆయనకు పిచ్చి పట్టింది అంటూ కూడా రాసుకోచ్చారని చెప్పుకొచ్చాడు. ఆయన పిచ్చి తగ్గడం కోసం టాబ్లెట్లు కూడా వేసుకుంటున్నారని నెగటివ్ వార్తలన్నీ స్ప్రెడ్ చేశారు. దీంతో విసిగిపోయిన రజనీకాంత్ టార్చర్ అనుభవించి, ఇక జర్నలిస్టుల జోలికి పోవద్దని అర్థం చేసుకున్నాడు.
అప్పటినుంచి యోగా, ధ్యానం వంటివి చేస్తూ కోపాన్ని అనచుకునే ప్రయత్నాలు అన్నీ చేసి చివరికి ఆధ్యాత్మిక చింతన లోకి వెళ్లిపోయారు.. ప్రస్తుతమైన ఎంతో మారిపోయారని, కోపాన్ని పూర్తిగా మర్చిపోయారని, ఇప్పటికీ మా కుటుంబంతో రజనీకాంత్ కు మంచి అనుబంధం ఉందని అన్నారు. ఈ విధంగా నాగబాబు కామెంట్లు చేయడంతో సోషల్ మీడియాలో అది వైరల్ గా మారింది. రజనీకాంత్ అంటే పడని కొంతమంది వ్యక్తులు ఆయనకు పిచ్చి ఉందంటూ మరోసారి వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు.(Rajinikanth)