Savitri: మహానటి మూవీలో సావిత్రిని మోసం చేసిన సత్యం ఆయనేనా.?
Savitri: మహానటి మూవీ సావిత్రి జీవిత చరిత్రను బేస్ చేసుకుని వచ్చినటువంటి చూస్తే మహానటి మళ్లీ నటిస్తుందా అనే అనుమానం కలగక మానదు. ఇప్పుడు సావిత్రి నటన చూసినవారు ఈ చిత్రాన్ని చూసి ఆశ్చర్య పోయారట. సావిత్రమ్మ మళ్ళీ పుట్టి నటిస్తుందా అనే విధంగా కీర్తి సురేష్ ఇందులో నటించింది, కాదు కాదు జీవించిందని చెప్పవచ్చు.. సాధారణంగా సినీ ఇండస్ట్రీలోని వారి జీవిత కథలను బేస్ చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి..

Is Satyam the one who cheated on Savitri in the movie Mahanati
కానీ మహానటి సినిమా ప్రతి ఒక్కరికి హృదయాన్ని తాకి అద్భుతమైన హిట్ సాధించింది. అలాంటి చిత్రాన్ని నాగ్ అశ్విన్ చాలా అద్భుతంగా తెరకెక్కించారని చెప్పవచ్చు. ఇందులో కీర్తి సురేష్ నటనని చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. అంతవరకు కీర్తి సురేష్ కు లేని పేరు మహానటి మూవీ ద్వారా వచ్చిందని చెప్పుకోవచ్చు.. అయితే ఈ సినిమాను చూసిన చాలామంది సావిత్రి జీవితంలో ఇలాంటి విపత్కర పరిస్తితులు వచ్చాయని అనుకుంటారు. (Savitri)
Also Read: Rana Daggubati: తండ్రి కాబోతున్న రానా దగ్గుబాటి.. ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్.?
కానీ ఈ చిత్రంలో కథ నూటికి నూరు శాతం ఫర్ఫెక్ట్ కాదట. అయితే ఈ చిత్రంలో నటుడు మహేష్ కూడా ప్రేక్షకులు మెప్పించే పాత్ర చేశాడు. ఈ సినిమాలో తన పాత్ర పేరు సత్యం.. ఈయన సావిత్రి గారి ఇంట్లో పనిచేసే వ్యక్తిగా నటించాడు, చిత్రంలో సావిత్రి చివరి రోజుల్లో ఆయన కూడా ఒక చెక్ మీద సంతకం చేయించుకుని వెళ్లిపోయిన పాత్ర చేశాడు. తర్వాత షాట్ లో ఒక సినిమాని ఈయన ప్రొడ్యూస్ చేస్తున్న సన్నివేశం కనబడుతుంది.

నిజంగానే సావిత్రి జీవితంలో సత్యము అనే వ్యక్తి ఉన్నాడా అనే విషయానికి వస్తే మాత్రం, ఇందులో సత్యం అనే పాత్ర అసత్యమేనట. సావిత్రి జీవితములో సత్యం అనే పేరు లేదని చాలామంది సీనియర్ పాత్రికేయులు అంటున్నారు. ఈ విధంగా సత్యం లాంటి ఎందరో చేతుల్లో ఆర్థికంగా చాలా నష్టపోయిందని, అయినా సావిత్రి మాత్రం ఎవరిని ఒక్క మాట అనకుండా ఆర్థికంగా లేకున్నా, తాను చనిపోయే వరకు చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ చివరికి తనువు చాలించిందని చెబుతారు. ఇందులో సత్యం అనే పాత్రను ఉదాహరణగా మాత్రమే సృష్టించామని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలియజేశారు.(Savitri)