Sreeleela: శ్రీలీల కు పెళ్లి చేసే బాధ్యత ఆ హీరోదేనా.. ఇంతకీ వారి మధ్య ఉన్న బంధం ఏంటంటే..?
Sreeleela: టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు శ్రీలీల మాత్రమే. శ్రీలీల తన యాక్టింగ్ తో డ్యాన్స్ తో ఎంతోమంది హీరోలను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఈమె చేసిన సినిమాలు కొన్ని ఫ్లాప్ అయినా సరే ఎంతోమంది హీరోలు పిలిచి మరీ అవకాశం ఇస్తున్నారు. అలా ఇండస్ట్రీలో ఉవ్వెత్తున దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గానే పుష్ప-3 లో కిస్సిక్ అనే ఐటెం సాంగ్ తో మెరిసిన సంగతి మనకు తెలిసిందే.
Is that hero responsible for marrying Sreeleela
ఈ సినిమాలో తన డ్యాన్స్ తో బన్నీని సైతం ఆకట్టుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం కొన్ని సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి రాబిన్ హుడ్.. అయితే అలాంటి శ్రీలీల ఇలా పెళ్లి సంబంధాలు చూసే బాధ్యత తనదేనని ఓ హీరో మాట ఇచ్చారు.మరి ఆ హీరో ఎవరు.. ఆ హీరోకి శ్రీలీలకి మధ్య ఉన్న బంధం ఏంటి అనేది చూస్తే..(Sreeleela)
Also Read: Sreeleela: శ్రీలీల రూమ్ లో స్టార్ హీరో.. ఏం జరుగుతుంది..?
శ్రీలీలకు పెళ్లి సంబంధాలు చూసే బాధ్యత తనదే అంటూ చెప్పింది ఎవరో కాదు నందమూరి బాలకృష్ణ. అవును మీరు వినేది నిజమే..నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి తాజాగా నవీన్ పోలిశెట్టితో పాటు శ్రీలీల కూడా వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే శ్రీలీలకి పెళ్లి సంబంధాలు చూసే బాధ్యత తనదే అంటూ బాలకృష్ణ మాట ఇచ్చారు.
అంతేకాదు శ్రీలీలకు ఇష్టమైన మహేష్ బాబు, యష్, అల్లు అర్జున్ వంటి హీరోలకు ఉండే క్వాలిటీ అన్నీ ఉండే అబ్బాయిని చూస్తానని బాలయ్య బాబు హామీ ఇచ్చారు. ఇక నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య బాబుకి కూతురు పాత్రలో శ్రీలీల నటించిన సంగతి మనకు తెలిసిందే.(Sreeleela)