Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో రెంట్ కి ఉంటున్న బాలీవుడ్ స్టార్ హీరో.?

Rakul Preet Singh: ఏంటి బాలీవుడ్ లో ఉండే స్టార్ హీరో రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో అద్దెకి ఉండడమా.. అంత దుస్థితి ఆయనకేం పట్టింది..ఎన్నో వేలకోట్ల ఆస్తులు ఉన్న ఆయన ఒక హీరోయిన్ ఇంట్లో అద్దెకు ఉండడం ఏంటి అని ఈ విషయం తెలిసిన చాలా మంది నెటిజన్లు షాక్ అయిపోతారు. మరి ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే బాలీవుడ్ కింగ్ కాన్ షారుక్ ఖాన్.. అయితే 3000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న ఈ హీరోకి వేరే వాళ్ళ ఇంట్లో రెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఏంటి అని చాలామందికి అనుమానం వస్తుంది.
Is the Bollywood star hero staying in Rakul Preet Singh house on rent
అయితే షారుఖ్ ఖాన్ దాదాపు రెండు వందల కోట్ల విలువ చేసే మన్నత్ అనే బంగ్లాలో తన ఫ్యామిలీతో కలిసి ఉంటారు. అలాగే ఆ బంగ్లాలోనే తన ఆఫీస్ కూడా ఉంటుంది. అయితే తాజాగా ఆ బంగ్లాని రేనోవేషన్ కి ఇచ్చారట. ఈ కారణంగానే ఆయన జాకీ భగ్నాని తండ్రి కొనుగోలు చేసిన ఫ్లాట్లో ఉండడానికి దాదాపు మూడు సంవత్సరాలు ఆ ఫ్లాట్ ని లీజుకు తీసుకున్నారట. (Rakul Preet Singh)
Also Read: Heroine: హీరోయిన్ మీద మోజుతో సినిమా తీసి బొక్క బోర్లా పడ్డ నిర్మాత..?
అయితే ఆ ఫ్లాట్ ఒక నెల రెంట్ ఏకంగా 24 లక్షలని తెలుస్తోంది. ఆ ఫ్లాట్ ముంబై లోని కాస్ట్లీ ఏరియాలో ఉందట. అలాగే ఈ ఫ్లాట్లోనే తన ఫ్యామిలీతో పాటు తన ఆఫీసు కూడా ఉంటుందని మూడు సంవత్సరాల తర్వాత మళ్లీ తన మన్నత్ బంగ్లాలోకి షారుక్ ఖాన్ మారుతారని తెలుస్తోంది.ఇక మన్నత్ అనే బంగ్లాని షారుక్ 2001లో తీసుకున్నారు. అప్పట్లో దాని విలువ దాదాపు 30 కోట్లట.

కానీ ప్రస్తుతం దాని విలువ 200 కోట్లు అని తెలుస్తోంది.అయితే షారుక్ ఖాన్ ఉండబోతున్న ఆ ఫ్లాట్ రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకి భగ్నాని పేరు మీద ఉందట.అలా భర్త ఆస్తి అంటే రకుల్ ప్రీత్ సింగ్ కి కూడా చెందుతుంది కాబట్టి రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో షారుక్ ఖాన్ అద్దెకు ఉంటున్నారు అంటూ బాలీవుడ్ లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.(Rakul Preet Singh)