Mad 2: మ్యాడ్ స్క్వేర్ “లడ్డుగాడి” కి విజయ్ దేవరకొండ కి మధ్య ఉన్న రిలేషన్.. అంత దగ్గరా.?


Is the relationship between Mad 2 Laddu Gadu and Vijay Deverakonda

Mad 2: మ్యాడ్, మ్యాడ్ -2 సినిమాలు చూసిన ప్రతి ఒక్కరికి లడ్డు గాడి క్యారెక్టర్ గుర్తుంటుంది.ముఖ్యంగా ఈ సినిమాలో కీలకపాత్రలో నటించిన ముగ్గురు హీరోలు అయినటువంటి సంతోష్ శోభన్,నార్నె నితిన్,రామ్ నితిన్ వీరందరితోపాటు లడ్డు గాడి పాత్రలో నటించిన విష్ణు క్యారెక్టర్ కూడా చాలా ఫేమస్ అయ్యింది. ముఖ్యంగా మ్యాడ్-2 కి సంబంధించిన ట్రైలర్, టీజర్ అన్నింట్లో కూడా లడ్డు గాడి పెళ్లి అనే సీన్ చాలా వైరల్ అయింది.లడ్డు గాడి క్యారెక్టర్ లో నటించిన విష్ణు చాలా ఫేమస్ అయ్యా

Is the relationship between Mad 2 Laddu Gadu and Vijay Deverakonda

అయితే అలాంటి మ్యాడ్ స్క్వేర్ లో లడ్డు గాడు క్యారెక్టర్ లో నటించిన విష్ణు కి రౌడీ హీరో విజయ్ దేవరకొండ కి మధ్య సంబంధం ఉందట. అదేలా అంటే.. విజయ్ దేవరకొండ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలో విజయ్ దేవరకొండ కి విష్ణు సబ్ జూనియర్ అంట. అలా వీరిద్దరి మధ్య కాలేజీ డేస్ లో ఫ్రెండ్షిప్ మొదలైందట. (Mad 2)

Also Read: Anupriya Goenka: మనోజ్ హీరోయిన్ ప్రైవేట్ ప్లేస్ ని గట్టిగా నొక్కిన హీరో.?

అయితే కాలేజీ డేస్ లో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా విజయ్ దేవరకొండ తన టాక్సీవాలా మూవీలో హాలీవుడ్ అనే పాత్రలో విష్ణుకి ఛాన్స్ ఇచ్చారట. అలా టాక్సీవాలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ విష్ణు గురించి మాట్లాడుతూ.. విష్ణు చాలా టాలెంటెడ్ పర్సన్.ఆయన మంచి ఫోటోగ్రాఫర్. ఆయన ఫోటోగ్రాఫి కి చాలామంది ఫిదా అయ్యారు. అలాగే పలు షార్ట్ ఫిలిమ్స్ కూడా చేశారు.

Is the relationship between Mad 2 Laddu Gadu and Vijay Deverakonda

ఈయన లైఫ్ లో ఎప్పటికైనా ఒక మంచి పొజిషన్లోకి వెళ్తారు అంటూ ఆ ఈవెంట్ లో విజయ్ దేవరకొంమాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. అంతేకాదు విజయ్ దేవరకొండ చెప్పినట్లే విష్ణు తన నటనతో జీవితంలో మంచి స్టేజ్ కి వెళ్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.అలా విజయ్ దేవరకొండ కి విష్ణు కి మధ్య కాలేజీ డేస్ లో స్నేహం ఉందట.(Mad 2)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *