Sobhita: మంగళ స్నానంలో శోభిత వేసుకున్న నగల వెనుక ఇంత చరిత్ర ఉందా.?
Sobhita: మరో రెండు రోజుల్లో అక్కినేని ఇంట పెళ్లి భాజలు మోగబోతున్నాయి.. నాగచైతన్య పెళ్లి అంగరంగ వైభవంగా దగ్గరి కుటుంబ సభ్యుల మధ్య జరగబోతోంది.. అక్కినేని ఫ్యామిలీ ఎంతో ఇష్టపడే అన్నపూర్ణ స్టూడియోలోనే నాగచైతన్య శోభిత మెడలో మూడు ముళ్ళు వేయనున్నారు. ఈ చూడ ముచ్చటైన జంటను ఆశీర్వదించడానికి ఎంతోమంది అక్కడికి రానున్నారట. అయితే ఈ క్రమంలోనే ఇప్పటికే పెళ్లి పనులు పూర్తిగా అయిపోయాయి.
Is there so much history behind the jewelry Sobhita wore in the Mangala snanam
పెళ్లికి ముందు చేసే మంగళ స్నానాలు, హల్దీ ఫంక్షన్ ఫోటోలు సోషల్ మీడియా విపరీతంగా హైలెట్ అవుతున్నాయి. తాజాగా అక్కినేని ఇంటికి రాబోతున్న కొత్త కోడలు శోభిత ధూళిపాళ ఫ్రీ వెడ్డింగ్ ఫోటోలు నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి. అయితే వారి కుటుంబ సభ్యులు సాంప్రదాయం ప్రకారం శోభిత ధూళిపాలకు మంగళ స్నానం చేయించారు. ఈ తంతులో కుటుంబ సభ్యులంతా సాంప్రదాయంగా ఆభరణలు ధరించారు.(Sobhita)
Also Read: Janaki Ram: ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ లతో జానకిరామ్ భార్యకి గొడవలా.. డైరెక్టర్ చెప్పిన షాకింగ్ నిజం.?
ఇందులో పసుపుతో స్నానం చేయించడం, తెలుగువారి సాంప్రదాయం ప్రకారం తన తల్లి, అమ్మమ్మల నగలు ధరించడం వంటి ఘట్టం ముగిసిందట. అయితే ఆచారం ప్రకారం ఎనిమిది దిక్కుల దేవతలకు ప్రార్థనలు చేసి పెళ్లిలో వధువును శుద్ధి చేస్తారట. ఈ క్రమంలోనే శోభిత ధూళిపాలకు కూడా తన తాత, ముత్తాతల నుంచి వచ్చినటువంటి నగలు వేసుకొని మంగళ స్నానం ఘట్టాన్ని పూర్తి చేశారట..
అయితే శోభిత కుటుంబంలో ఎవరికి పెళ్లి అయినా ఈ నగలు వేసి పూజలు చేసే తంతు ముగిస్తారట. దీని వల్ల పెళ్లి చేసుకున్న వారు నిండు నూరేళ్లు ఆనందంగా జీవిస్తారని వివాహ బంధం హ్యాపీగా కొనసాగుతుందని వారు నమ్ముతారట. ఈ విధంగా శోభిత ధూళిపాల వివాహ గట్టమనేది అత్యంత సాంప్రదాయ పద్ధతిలో జరుగుతోందని తెలుస్తోంది. ఇక శోభిత పెళ్లి నాగచైతన్యతో డిసెంబర్ 4వ తేదీన అంగరంగ వైభవంగా నాగేశ్వరరావు విగ్రహం ముందు జరగనుంది.(Sobhita)