Indra Movie: ఇంద్ర సినిమా ఇండస్ట్రీ హిట్ వెనుక ఇంత పెద్ద కథ నడిచిందా.?

Indra Movie: తెలుగు ఇండస్ట్రీలో యాక్షన్ సినిమాలైనా కామెడీ, లవ్, ఎమోషనల్, ఏ సినిమాలైనా అలఓకగా నటించే ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి.. సినిమా ఇండస్ట్రీకి సరికొత్త డాన్స్, డైలాగ్స్, ఫైట్స్, చూపించిన హీరోగా చిరంజీవి ముందు స్థానంలో ఉంటారు. అందుకే ఈయనకు అభిమానులు మెగాస్టార్ అనే బిరుదు ఇచ్చారు. అలాంటి చిరంజీవి ఇంద్ర సినిమా చేయడం వెనక ఒక పెద్ద స్టోరీ ఉందట. ఒక చిన్న కారణం వల్ల ఆ సినిమానే వద్దనుకున్నారట దర్శకుడు. మరి ఆ స్టోరీ ఏంటి వివరాలు చూద్దాం..
Is there such a big story behind the industry hit Indra Movie
చిరంజీవిని హీరోగా తీసుకొని బి.గోపాల్ డైరెక్షన్ లో అశ్విని దత్ ఒక సినిమా చేయాలనుకున్నారట. దీనికోసం మెగాస్టార్ ను సంప్రదిస్తే ఆయన ఒకే చెప్పడంతో అశ్వనిదత్ గోపాల్ దగ్గరికి వెళ్లి చిరంజీవి సినిమాకి ఒప్పుకున్నారు ఒక మంచి కథ తయారు చేయమని చెప్పారట.. దీంతో గోపాల్ చిన్నికృష్ణ దగ్గర ఆల్రెడీ ఒక కథ ఉంది, అది ఓకే అయితే చిరంజీవితో చేసేద్దాం అన్నారట.. గోపాల్ వెళ్లి చిన్నికృష్ణ దగ్గర పూర్తి కథ విని ఇది నరసింహనాయుడు, సమరసింహారెడ్డి యాక్షన్ సినిమాల మాదిరిగానే ఉంది.(Indra Movie)
Also Read: Manchu Manoj: ఈ గొడవలన్నీ నా భార్యే చేసింది.. మంచు మనోజ్ సంచలనం.?
ఇలాంటి కథతో సినిమా చేస్తే మనం బొక్క బోర్లా పడతామని చెప్పారట. తర్వాత పరుచూరి గోపాలకృష్ణ వద్దకు వీరంతా చేరుకున్నారు. చిరంజీవితో ఒక సినిమా చేద్దామనుకుంటున్నాం చిన్నికృష్ణ దగ్గర ఒక కథ ఉంది కానీ అది పాత కథలాగే అనిపిస్తోందని చెప్పారట. దీంతో గోపాలకృష్ణ ఆ కథ విని అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇంద్ర అనే టైటిల్ ఇచ్చారట. ఇంకేముంది సినిమా షూటింగ్ ప్రారంభమై భారీ అంచనాల నడుమ రిలీజ్ కూడా అయింది.

అప్పటికే ఇండస్ట్రీలో రిలీజ్ అయినటువంటి పెద్ద పెద్ద సినిమాల మధ్య ఇంద్ర రిలీజ్ అయి మొదటి రెండు రోజులు కాస్త డల్ గా నడిచింది. ఆ తర్వాత మూడో రోజు నుంచి సినిమా పుంజుకోవడం మొదలుపెట్టింది.. అలా వారం గడిచేసరికి సినిమా కొన్ని వారాలపాటు హౌస్ఫుల్ బోర్డులతో కిటకిటలాడిపోయిందని చెప్పవచ్చు. అలా ఆ ఇయర్ లోనే ఇంద్ర సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇక ఇందులో కథతోపాటు పాటలు, చిరంజీవి జోడీగా సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ నటన మరింత కలిసి వచ్చిందని చెప్పవచ్చు.(Indra Movie)