Oyo: Oyo రూమ్స్‌ వెనుక ఇంత సక్సెస్‌ స్టోరీ ఉందా ?

Oyo: ఓయో అంటే తెలియని వారంటూ ఎవరూ లేరు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి దీని గురించి తెలుసు. ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి తొందరగా గుర్తుకు వచ్చే పేరు ఓయో రూమ్స్. ఇంతటి గుర్తింపు తెచ్చుకున్న ఓయో రూమ్స్ కి ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం…. ఓయో పూర్తి పేరు ఆన్ యువర్ ఓన్. ఈ హోటల్స్ కి మొదట ఓయో అని పేరును పెట్టాలని అసలు అనుకోలేదట.

Is there such a success story behind Oyo Rooms

దీనికి మొదట ఓవరాల్ అనే పేరును పెట్టారట. ఆన్ యువర్ ఓన్ అంటే కస్టమర్లు హోటల్ రూమ్ నీ బుక్ చేసుకున్న తర్వాత తమ ఓన్ రూమ్ అని అనుకుంటారని భావించారట. ఓయో వ్యవస్థాపకుడు యజమాని రితేష్ అగర్వాల్. మొదట దీని పేరు ఓవరాల్ అయితే ఓయోగా 2013లో మార్చారు. తాజాగా ఓయో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పెళ్లి కాని వారు యువతకు హోటల్ లో రూమ్ ఇవ్వమని వెల్లడించింది.

ఓయో కంపెనీ ప్రకారం పెళ్లి కాని వారు ఇకనుంచి హోటల్ రూమ్ ను అద్దెకు తీసుకోలేరు. జంటలు ఎవరైనా సరే కచ్చితంగా తమ మ్యారేజ్ ధ్రువీకరణ పత్రాన్ని లేదా ఫోటోస్ అయినా చూపించాలి. అయితే ఈ ఓయో కొత్త రూల్ భారత దేశంలోని అన్ని ప్రాంతాలకు వర్తించదు. ఈ నిబంధనను మీరట్ లో మాత్రమే ప్రవేశపెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *