Akhil: అఖిల్ కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఇదేనా.?
Akhil: అక్కినేని ఫ్యామిలీ మూడోతరం హీరోలుగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు అక్కినేని నాగచైతన్య, అఖిల్.. అయితే నాగచైతన్య ఓ మోస్తారు హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అఖిల్ మాత్రం సినిమాల్లో గుర్తింపు కోసం ఎంతో కష్టపడుతున్నారు. అలాంటి అఖిల్, తాజాగా ఓ ఇంటి వాడు కాబోతున్నాడని తెలుస్తోంది.. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున తన సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు. మరి అఖిల్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు, ఆమె బ్యాగ్రౌండ్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Is this the background of Akhil fiancee
అక్కినేని ఫ్యామిలీ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ఉంటుంది. అలాంటి ఫ్యామిలీలోకి కోడలిగా రాబోతుంది అంటే తప్పనిసరిగా ఆమె బ్యాగ్రౌండ్ భారీగానే ఉండి ఉంటుంది. అలాంటి అఖిల్ ను చేసుకోబోయే అమ్మాయి పేరు జైనబ్ రావుడ్జి.. అయితే ఈమె ఢిల్లీకి చెందినటువంటి అమ్మాయి అని తెలుస్తోంది. అయితే ఈమె ఆర్టిస్ట్ గానే కాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కూడా పనిచేస్తుందట.. (Akhil)
Also Read: Nagarjuna: అఖిల్ అక్కినేని నిశ్చితార్థం.. శుభవార్త చెప్పిన నాగార్జున!!
అంతేకాదు జైనబ్ భారత దేశంలోనే కాకుండా లండన్, దుబాయిలో కూడా నటిగా రాణిస్తుందట. ఈమె అఖిల్ తో గత ఆరు సంవత్సరాల నుంచి లవ్ లో ఉందని, దీంతో ఇరు కుటుంబాల మధ్య మాట్లాడుకుని పెళ్లికూడా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీల్లే కాకుండా జైనబ్ తండ్రి జుల్ఫీ, నాగార్జున కూడా మంచి స్నేహితులట.. వీరి స్నేహం కారణంగానే అఖిల్ కు జైనబ్ కు మధ్య స్నేహం పుట్టి అది ప్రేమగా మారిందని తెలుస్తోంది.
త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇక వీరి పెళ్లే కాకుండా అక్కినేని నాగచైతన్య శోభిత దూళిపాళ పెళ్లి కూడా డిసెంబర్ 4న జరగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతలోనే అఖిల్ కు కూడా పెళ్లి కాబోతున్నట్టు వార్తలు రావడంతో అక్కినేని అభిమానులంతా సంబరపడిపోతున్నారు. ఇక అఖిల్ సినిమాల విషయానికొస్తే రాబోయే కొత్త సినిమా అయినా సరే అద్భుతమైన హిట్ కొట్టాలని అక్కినేని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.(Akhil)