Suriya: సూర్య సినిమాలు ఆపేయడం బెటర్.. ఆయన పని ఖతం.?

Suriya: సూర్య తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఈయన పేరు తెలియని వారు ఉండరు. చూడటానికి తమిళ వ్యక్తి అయినా కానీ తెలుగు హీరోగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. అలాంటి సూర్య ఎన్నో సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో అనేక మైలురాళ్లు దాటాడు. కానీ గత కొంతకాలంగా దారుణంగా విఫలమవుతూ కెరియర్ కొనసాగిస్తున్నాడు. అయితే తాజాగా సూర్య హీరోగా వచ్చినటువంటి, కంగువా మూవీ అతి దారుణంగా ఫ్లాప్ అయింది. దాదాపు మూడు సంవత్సరాలు కష్టపడి ఎన్నో కసరత్తులు చేసి తీసినటువంటి ఈ మూవీ 150 కోట్లకు పైగా నష్టాన్ని తీసుకువచ్చింది.
It is better to stop Suriya films
అలాంటి సినిమా ప్లాప్ అవ్వడంతో రియాక్ట్ అయినటువంటి నటుడు పృథ్వీరాజ్ సూర్యపై చాలా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.. సూర్య సినిమా బాగా రావడం కోసం ఎంతో కష్టపడతాడు, తనకు ఇమేజ్ పెంచే పాత్రల కోసం ఎంతవరకైనా వెళ్లి నటిస్తాడు. అలాంటి ఆయన ఈ మధ్యకాలంలో దారుణంగా ఫ్లాప్ అవుతున్నారు. దీన్నిబట్టి చూస్తే ఇమేజ్ తగ్గిపోయిందని చెప్పవచ్చు. ఇక ఆయన ఏ ప్రయత్నం చేసినా విజయం అందుకోవడం చాలా కష్టమే అంటూ చెప్పుకొచ్చారు.(Suriya)
Also Read: Chiranjeevi: చిరంజీవికి నితిన్ భార్యకి మధ్య రిలేషన్.. షాకింగ్ సీక్రెట్.?
సూర్య మార్కెట్ మళ్లీ గాడిలో పడడం కష్టమే అంటూ చెప్పుకొచ్చారు పృథ్వీరాజ్. మూడు సంవత్సరాలు కష్టపడి తీసిన ఈ కంగువా మూవీ కనీస వసూళ్ళు కూడా చేయలేదు అంటే సూర్య ఇమేజ్ జనాల్లో ఎంత ఉందో అర్థం అవుతుంది. ఒకప్పుడు ఆయన సినిమా వచ్చిందంటే కొన్ని వారాలపాటు హౌస్ ఫుల్ బోర్డులు కనిపించేవి, అలాంటి స్థాయి నుంచి సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యే పరిస్థితికి వచ్చిందంటే ఆయన టైం ఇక అయిపోయిందని అర్థం అంటూ చెప్పాడు.

అయితే పృథ్వీరాజ్ చెప్పిన మాటలు విన్నటువంటి కొంతమంది నేటిజన్స్ ఇక సూర్య సినిమాలు చేయడం మానేయండి అని చెప్పకనే చెబుతున్నారా పృథ్వీరాజ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా కంగువా మూవీతో దారుణంగా ఫ్లాప్ అయ్యారు. మరి ఈ దెబ్బతో అయిన సూర్య ఆగిపోతారా? లేదంటే హిట్టు కోసం ముందుకు వెళ్తారా? అనేది ముందు ముందు తెలుస్తుంది.(Suriya)