Hyderabad: హైదరాబాద్ కాదు దోమలబాద్!


Hyderabad: హైదరాబాద్ కాదు దోమలబాద్ అంటూ సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మొద్దు నిద్రలో జీహెచ్‌ఎంసీ అధికారులు, దోమల చేతిలో చిత్తడి అవుతున్నారు ప్రజలు. సిటీలో రోజురోజుకి పెరుగుతున్న దోమల బెడద, సాయంత్రం ఆరు దాటాక బయటకి వస్తే దోమలకి పలహారమే అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సిటీ ప్రజలు.

It is going viral on social media saying that it is not Hyderabad but Domalabad

గ్రేటర్ పరిధిలో దోమల నివారణ కోసం చేసే ఫాగింగ్ కూడా ఆపేసారట జి.హెచ్.ఎం.సి సిబ్బంది. గత ఏడాది నుండి సిటీలో చాల చోట్ల మరుగు నీటి డ్రైనేజీలని శుభ్రం చెయ్యడం ఆపేసిందట జీహెచ్‌ఎంసీ సిబ్బంది. డ్రైనేజీ లీకులతో రోడ్ మీదే పారుతున్న మరుగు నీరు, అక్కడ నుండే పుట్టుకొస్తున్నాయి భయంకరమైన దోమలు.

మురుగుతో నిండి ఘోరమైన కంపు కొడుతున్నాయి చెరువులు, కుంటలు, డ్రైనేజీలు. దోమల దెబ్బకి డెంగీ, మలేరియా, చికెన్ గున్యా వంటి విషజ్వరాలతో మంచం పడుతున్నారు సిటీ వాసులు. మరి దీనిపై ఇంకా చర్యలు తీసుకోవడం లేదు అధికారులు.

https://twitter.com/TeluguScribe/status/1895516522795212972

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *