Jagan: కూటమికి చెక్… బెంగళూరు ప్యాలెస్ లో జగన్ బిగ్ స్కెచ్ ?
Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయిన తర్వాత.. చాలామంది జారుకుంటున్నారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు అనుభవించిన వారు కూడా జంప్ అయ్యారు. దీంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒంటరయ్యారు. పెద్దిరెడ్డి లాంటి వాళ్లు అండగా ఉన్నప్పటికీ వాళ్లపై కూడా చంద్రబాబు కూటమి ప్రభుత్వం కేసులు పెడుతున్న సంగతి తెలిసిందే.

Jagan Big Sketch in Bangalore Palace
అయితే ఇలాంటి నేపథ్యంలో వైసీపీ పార్టీని మళ్ళీ బలోపేతం చేసేందుకు రంగం సిద్ధం చేశారు జగన్మోహన్ రెడ్డి. వైసిపి సోషల్ మీడియా చాలా బలంగా ఉందని మొన్న లైలా ఎపిసోడ్స్ నేపథ్యంలోనే తేలిపోయింది. ఇప్పుడు పార్టీని బలోపేతం చేయాలి. అందుకే వైసిపి పార్టీ సభ్యత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట జగన్మోహన్ రెడ్డి.
దీని కోసం ఏపీ వైసీపీ నాయకులను బెంగళూరు ప్యాలస్ కు రప్పించుకున్నారట జగన్. ఈ సందర్భంగా… వైసిపి పార్టీ భవిష్యత్తు కార్యచరణ పైన చర్చించారట. త్వరలోనే వైసిపి పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని పూర్తిచేసి పాదయాత్ర చేసేందుకు రంగం సిద్ధం చేశారట జగన్మోహన్ రెడ్డి. ఉగాది తర్వాత లేదా ఎండాకాలం పూర్తయిన తర్వాత పాదయాత్ర చేయనున్నారట.