Jagan: చంద్రబాబు సర్కార్ మద్యం పాలసీపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బూం బూం బీర్లు తెచ్చిన మేధావి చంద్రబాబేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు, బాలకృష్ణ సినిమా బ్రాండ్లు అంటారని… సచిన్ టెండుల్కర్, విరాట్ కొహ్లి బ్రాండ్ అంటాడు.. తేడా ఏం ఉండదని మద్యం బ్రాండ్లపై వైఎస్ జగన్ హాట్ కామెంట్స్ చేశారు. ఏ డిస్టిలరీ నుండి వస్తుంది, అది నోటిఫైడా కాదా అన్నది మాత్రమే తేడా కనపడుతుందని వివరించారు వైఎస్ జగన్. Jagan
Jagan Comments On Ap liquor Brands
అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. ప్రజలు తిరగబడితే చంద్రబాబు ఆయన పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాదని వార్నింగ్ ఇచ్చారు. జమిలి ఎన్నికల నిర్వహణ ఎవరి చేతుల్లో లేదని…. జమిలి ఎన్నికలు జరిగితే సిద్ధంగా ఉండటమే మన చేతుల్లో ఉందని తెలిపారు. అందుకు ప్రిపేర్ గా ఉండాలని పార్టీ శ్రేణులకు చెప్పామన్నారు. Evm లపై మా ఫైట్ కొనసాగుతోంది… ఒంగోలులో evm లపై హైకోర్టులో పిటిషన్ వేశామని వివరించారు. Jagan
Also Read: Janasena: జనసేన పార్టీలోకి బొత్స సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్యేలు ?
ఈసీ వీవీ ప్యాట్లు, evm లలో ఓట్లు మ్యాచ్ చేయవచ్చు కదా…. ఇలా చేస్తే దేశంలో ఉన్న అందరి డౌట్లు పోతాయి కదా అంటూ పేర్కొన్నారు. మా ముందు వెరిఫై చేయాలని కోరామని.. ఈసీ కి ఏ కల్మషం లేకపోతే వెరిఫై చేయవచ్చు కదా అంటూ నిలదీశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. హైకోర్టులో ఈసీ మాత్రం సుప్రీం మాక్ పోలింగ్ మాత్రమే చేయమని చెప్పిందని చెప్పిందన్నారు. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ను వక్రీకరిస్తున్నారని… మాక్ పోలింగ్ వల్ల ఏం లాభం ఉంటుందని ప్రశ్నించారు. Jagan