Jagan: చంద్రబాబు పలావు పోయింది.. బిర్యానీ పోయింది ?

Jagan: చంద్రబాబు పలావు పోయింది.. బిర్యానీ పోయింది అంటూ జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైసీపీ నేతలతో తాజాగా మాట్లాడారు వైఎస్ జగన్. ఆరు నెలలు తిరక్కముందే చంద్రబాబు ప్రభుత్వంమీద తీవ్ర వ్యతిరేకత ఉందని బాంబ్‌ పేల్చారు జగన్‌. ఇంతటి వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వంమీదా లేదని ఎద్దేవా చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోందని నిప్పులు చెరిగారు జగన్‌. Jagan

Jagan Comments on Chandrbabu naidu today

స్కామ్‌ల మీద స్కాంలు నడుస్తున్నాయని… శాండ్ మాఫియా, లిక్కర్‌ మాఫియా.. ఇలా మాఫియాలు నడుస్తున్నాయని చురకలు అంటించారు. మైనింగ్‌ జరగాలన్నా, ఏ కాంట్రాక్టు చేయాలన్నా ప్రతి ఎమ్మెల్యే నుంచి మొదలుకుని ముఖ్యమంత్రి వరకూ నాకింత.. నీకింత నడుస్తోందని ఆరోపణలు చేశారు. ప్రభుత్వమీద వ్యతిరేకత పార్టీకి సానుకూలంగా మారాలంటే ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేయాలని కోరారు జగన్‌. Jagan

Also Read: KTR: ఫార్ములా-ఈ రేస్…ఇరుకున్న రేవంత్‌ రెడ్డి..?

ఈనెల 27న కరెంటు ఛార్జీలమీద నిరసన వ్యక్తంచేస్తూ మరో కార్యక్రమం చేస్తున్నామని… మళ్లీ జనవరి 3న ఫీజురియింబర్స్‌మెంట్‌, వసతి దీవెనమీద చేస్తున్నామన్నారు జగన్‌. ప్రజల తరఫున మనం గొంతు విప్పాలని… అప్పుడే మనం నాయకులుగా ఎదుగుతామని వివరించారు జగన్‌. నాయకులుగా ఎదగడానికి ఇదొక అవకాశం అని.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టాలు, నష్టాలు ఉంటాయని తెలిపారు. కేసులుకూడా పెడతారు, జైళ్లలో కూడా పెడతారన్నారు. ప్రతి కష్టానికి ఫలితం ఉంటుంది, చీకటి తర్వాత వెలుగు కూడా వస్తుందని భరోసా కల్పించారు జగన్.Jagan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *