Jagan: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కీలక పదవి?
Jagan: వైసిపి పార్టీని బలోపేతం చేసేందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా… యంగ్ లీడర్ బై రెడ్డి సిద్ధార్థ రెడ్డికి కీలక పదవి కట్టబెట్టారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా… బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు వైసిపి పార్టీ నుంచి అధికారిక ప్రకటన కూడా విడుదలైంది.

Jagan Key post for Byreddy Siddhartha Reddy
ఏపీలో ఉన్న యువత మొత్తం వైసిపి వైపు చూడాలనే ఉద్దేశంతో… బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఈ పదవి అప్పగించినట్లు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన వైసీపీ పార్టీ… గతంలో జరిగిన తప్పిదాలను మళ్లీ రిపీట్ కాకుండా చూస్తోంది.
Ashutosh Sharma: కాటేరమ్మ కొడుకును తప్పు చేసిన పంజాబ్ ?
ఏపీ మధ్య వయస్కులు వైసిపి పార్టీకి ఓటు వేసినప్పటికీ.. యంగ్ జనరేషన్ మాత్రం చంద్రబాబు వైపు మళ్ళింది అని రిపోర్టులో తేలిందట. దీంతో… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని నియామకం చేసినట్లు కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మరి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ పదవిని ఎలా వినియోగించుకొని పార్టీని బలోపేతం చేస్తారో చూడాలి.
Ipl 2025: పోరాడి ఓడిన గుజరాత్… పంజాబ్ రాత మార్చుతున్న అయ్యర్ ?