Jagan: కార్పొరేటర్ కు ఎక్కువ… ఎమ్మెల్యేకు తక్కువ ?
Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్పొరేటర్ కు ఎక్కువ… ఎమ్మెల్యేకు తక్కువ అంటూ పవన్ కళ్యాణ్ పరువు తీశారు జగన్మోహన్ రెడ్డి. రెండు శాతం ఓట్ల తేడాతో ఓడిపోయిన వైసిపి పార్టీని అనే హక్కు అలాగే ఆ స్థాయి పవన్ కళ్యాణ్ కు లేదని చురకలాంటించారు.

Jagan mohan reddy raging pawan
తాము 11 సీట్లు గెలిచినా కూడా తమ ఓటు బ్యాంకు 40 శాతానికి పైగా ఉందని వెల్లడించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా తమదే ప్రభుత్వం అంటూ ధీమా వ్యక్తం చేశారు. జీవితంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి పవన్ కళ్యాణ్ ఏదో పోకడలకు వెళ్తున్నాడని మండిపడ్డారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.
అలాగే చంద్రబాబు పైన కూడా విమర్శలు చేశారు వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల కంటే ముందు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు… ఆ తర్వాత అన్ని ఎగగొట్టాడని ఫైర్.. కావడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలు సరైన సమయంలో ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి.