Avatar 3 Updates: జేమ్స్ కామెరూన్ “అవతార్ 3” అప్‌డేట్స్..టైటిల్ తో పాటుగా అదిరిపోయే విషయాలు!!
Avatar 3 Updates: హాలీవుడ్ స్టార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలు ఇండియాలో కూడా భారీ వసూళ్లను రాబడుతున్నాయి. “టైటానిక్,” “అవతార్” సినిమాలు మన దేశంలో ఎన్నో రికార్డులను తిరగరాశాయి. ఇక “అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్” దాదాపు 500 కోట్ల గ్రాస్ వసూలు చేసి, భారత బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాన్ని సాధించింది. కామెరూన్ సినిమాలపై ప్రేక్షకులలో అంచనాలు ఎప్పుడూ ఆకాశమే హద్దుగా ఉంటాయి.
James Cameron Avatar 3 Updates Revealed
కామెరూన్ సినిమాల కథలు ప్రధానంగా మైథాలజీ ఆధారంగా ఉండడం విశేషం. “పంచ భూతాలు” అనేవి అవతార్ కథలకు మూలం అని ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. మొదటి భాగం భూమి నేపథ్యంలో, రెండో భాగం నీరు ఆధారంగా తెరకెక్కించారు. అందుకే రెండో భాగానికి “అవతార్: ది వే ఆఫ్ వాటర్” అని పేరు పెట్టారు.
తాజాగా అవతార్ 3 పై ఆసక్తికరమైన అప్‌డేట్స్ వెలుగులోకి వచ్చాయి. ఈ సినిమా నిప్పు నేపథ్యంలో రూపొందుతోంది. “ఫైర్ అండ్ ఆష్” అనే టైటిల్‌తో మూడో భాగం విడుదల కానుంది. కొత్తగా ఒమక్టయా, మెట్కైనా అనే తెగలను పరిచయం చేయబోతున్నారు. పాండోరాలో ఓ ప్రత్యేకమైన ప్రదేశాన్ని దృశ్యమానంగా చూపించనున్నారు.
అవతార్ 3లో అత్యాధునిక టెక్నాలజీతో సరికొత్త విజువల్స్ చూపించనున్నారు. కామెరూన్ ఇప్పటివరకు చూపించని అనేక అద్భుతాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. భూమి, నీరు తర్వాత, ఇప్పుడు నిప్పు కథతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కామెరూన్ మరోసారి మ్యాజిక్ చేయనున్నారు. ఇక మిగిలిన భూతాలు అయిన ఆకాశం, వాయువు భవిష్యత్ అవతార్ సిరీస్ లో ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.