Janaki Ram: ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ లతో జానకిరామ్ భార్యకి గొడవలా.. డైరెక్టర్ చెప్పిన షాకింగ్ నిజం.?
Janaki Ram: తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. ఇంతటి గౌరవ మర్యాదలకు ప్రధాన కారకుడు అన్నా సీనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఆయన వల్లే నందమూరి అనే ఒక పేరు బ్రాండ్ గా మారింది. అలాంటి తారక రామారావు నట వారసులుగా హరికృష్ణ, బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో హరికృష్ణ ఓ మోస్తరు హీరోగా పేరు సంపాదించుకున్నారు. కానీ బాలకృష్ణ మాత్రం స్టార్ హీరోగా ఎదిగారు. ఇక వీళ్ళ వారసులుగా ఇండస్ట్రీలోకి కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఎదిగారు.
Janaki Ram wife has a fight with NTR and Kalyan Ram
ఇందులో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. మోక్షజ్ఞ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇదే తరుణంలో నందమూరి నాలుగవ తరం హీరోలుగా జానకిరామ్ కొడుకు రాబోతున్నారట. ఈయనను నందమూరి కుటుంబానికి వీరాభిమానిగా ఉన్నటువంటి దర్శకుడు వైవిఎస్ చౌదరి పరిచయం చేయబోతున్నారట. అయితే ఈయన పేరు కూడా నందమూరి తారకరామారావు కావడం ఆశ్చర్యకరం.. అయితే ఈ కొత్త తరం హీరోకు తన సొంత బాబాయిలు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సపోర్టు ఉంటుందని చాలామంది భావిస్తున్నారు.(Janaki Ram)
Also Read: Sai Pallavi: ఆ తప్పు నేను చేయలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న సాయి పల్లవి.?
కానీ అలాంటిది ఏమీ లేదని డైరెక్టర్ వైవిఎస్ చౌదరి తాజాగా చెప్పిన మాటలు చూస్తే అర్థమవుతుంది. అయితే ఆయన కొత్త సినిమా గురించి చెప్పే తరుణంలో మీడియా ఒక ప్రశ్న వేసిందట. ఆయనకు కళ్యాణ్ రామ్ మద్దతు ఉంటుందని ప్రశ్నించగా వైవిఎస్ చౌదరి డొంకతిరుగుడు సమాధానమిచ్చారట. ఇద్దరు ఈ హీరోకి చుట్టాలు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఈ అబ్బాయికి తల్లి ఉంది ముందు ఆమె అనుమతి అవసరం ఆ తర్వాత మిగతా వాళ్ళ సపోర్టు..
జానకిరామ్ కుమారుడికి సినిమా అనగానే తన తల్లి వైవిఎస్ చౌదరికి కొన్ని కండిషన్స్ పెట్టారని వాటి ప్రకారమే వైవిఎస్ చౌదరి నడుచుకుంటున్నారని మిగతా వాళ్ళ అవసరం లేదన్నట్టు ఆమె మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో నందమూరి కుటుంబం నుంచి కొత్త వారసుడి సినిమా వస్తుండడంతో అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ఆయనకు జోడీగా వీణరావు అనే కూచిపూడి డాన్సర్ ను హీరోయిన్ గా పరిచయం చేయబోతున్నారట.(Janaki Ram)