Janhvi Kapoor: జాన్వీ కపూర్ బోల్డ్ కామెంట్స్.. భర్తకి అలా చేయాలంటూ?
Janhvi Kapoor: ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది హీరోయిన్లు ఉండేవారు. ఆ ఉన్న హీరోయిన్లే ఎక్కువ సినిమాలకు కమిట్ అవుతూ నటించేవారు. అలా ఏడున్నార్, ఎన్టీఆర్, కాలం హీరోయిన్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సావిత్రి. ఈమె తర్వాత అంతటి పేరు సాధించిన మరో హీరోయిన్ శ్రీదేవి.. అప్పట్లో పాన్ ఇండియా సినిమాలు లేకముందే పాన్ ఇండియా లెవెల్ లో శ్రీదేవి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా చాలా సినిమాలు చేసి తనకు ఎదురు లేదు అనిపించుకుంది.
Janhvi Kapoor bold comments
ఇలాంటి అతిలోకసుందరి నట వారసురాలిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మరో హీరోయిన్ జాన్వికపూర్.. ఈమె కూడా బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత దేవర చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి భారీ హిట్ అందుకుంది.. దీంతో జాన్వి పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. వెంటనే ఈమెకు పాన్ ఇండియా స్టార్ రాంచరణ్ ఆర్సి 16 సినిమాలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ లభించబోతుందని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. (Janhvi Kapoor)
Also Read: Prashanth Varma: ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో అరడజన్ సినిమాలు.. ఇప్పుడు మరొకటి!!
ఇలా తెలుగులో మంచి ఫామ్ లో ఉన్నటువంటి జాన్వికపూర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని విషయాలను బయటపెట్టింది. అవే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.. అయితే జాన్వి కపూర్ కు తెలుగు రాష్ట్రాలంటే చాలా ఇష్టమట. ఇందులో ముఖ్యంగా తిరుపతి అంటే మరింత ఇష్టమని చెప్పుకొచ్చింది. తనకు ఎంతవరకు వీలైతే అంత తొందరగా పెళ్లి చేసుకుని తిరుపతిలో సెటిల్ అవ్వాలని ఉందని హీరోయిన్ జాన్వికపూర్ అన్నారు.
అంతేకాదు రోజు అక్కడే అరటి ఆకులోనే భోజనం చేస్తూ గోవింద అంటూ నామస్మరణలు చేయాలని ఉందని చెప్పింది. ఇక నా భర్త ఒక లుంగీ కట్టుకొని నా దగ్గర ఉంటే, ఆయనకు మసాజ్ చేస్తూ అలా రొమాంటిక్ గా బ్రతికేయాలని అనిపిస్తోంది. ప్రతిరోజు జడనిండా గుప్పెడు మల్లెపూలు పెట్టుకొని మణిరత్నం పాటలు వింటూ అలా లైఫ్ గడపాలని ఉందంటూ చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించింది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నేటిజన్స్ రకరకాలుగా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.(Janhvi Kapoor)