Jani Master: అసిస్టెంట్ ని టార్చర్ చేసింది నిజమే.. జానీ మాస్టర్ మళ్లీ జైలుకే..?
Jani Master: ఈ ఏడాది సినీ సెలబ్రిటీలకు అంతగా కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. వరుస వివాదాల్లో ఇరుక్కుంటూ ఉక్కిరిబిక్కిరి అవుతుంది ఇండస్ట్రీ మొత్తం.ఈ నేపథ్యంలోనే గత కొద్దిరోజుల ముందు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే.
Jani Master is back in jail
జానీ మాస్టర్ తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసే అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేస్తూ కోరిక తీర్చమని వేధించాడని, ఈవెంట్ల కోసం చెన్నై,గుజరాత్, ముంబై, హైదరాబాద్ వంటి ప్లేస్ లకి తీసుకువెళ్లి ఆమెను లైంగికంగా వేధించినట్టు జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేసే అమ్మాయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేస్ పెట్టడంతోనే జానీ మాస్టర్ దొరక్కుండా పారిపోయాడు.(Jani Master)
Also Read: Allu Arjun: అల్లు అర్జున్ 6వ ఇంట్లో శని..అందుకే ఈ వివాదాలు ?
ఎట్టకేలకు గోవాలో జానీ మాస్టర్ ని పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులు జైల్లో ఉంచి ఆయన్ని విచారించి ఫైనల్గా బెయిల్ మీద బయటికి వదిలేసారు. అయితే బయటికి వచ్చాక నేను ఈ కేసు నుండి పూర్తి నిర్దోషిగా బయటపడతాను అంటూ చెప్పారు. అయితే తాజాగా జానీ మాస్టర్ కి మరొకసారి షాక్ తగిలింది. లేడీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసిన ఫిర్యాదులో పూర్తిగా నిజమే ఉందని ఆమెను ఈవెంట్ల పేరుతో పలు ప్రదేశాలకు తీసుకువెళ్లి నిజంగానే లైంగికంగా వేధించాడు అంటూ పోలీసులు నిర్ధారణ చేశారు.
దీంతో జానీ మాస్టర్ ని పోలీసులు మళ్ళీ విచారించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ కేసులో జానీ మాస్టర్ మరొకసారి జైలుకు వెళ్లబోతున్నట్టు సమాచారం. ఒకవేళ నేరం రుజువైతే మాత్రం జానీ మాస్టర్ కి ఇక చుక్కలే. ఇక ఈ విషయం గురించి స్పందించిన జానీ మాస్టర్ నేను నిందితుడిని కాదు పూర్తి నిర్దోషిగా బయటికి వస్తాను నేను ఏ తప్పు చేయలేదు అంటూ మాట్లాడారు.(Jani Master)