Jani Master: జానీ మాస్టర్ ఇక జైలుకే.. గెలిచామంటున్న ఝాన్సీ.!

Jani Master: సినిమా ఇండస్ట్రీలో చాలామంది చిన్నచిన్న నటీమణులను అగ్ర తారలు ఇబ్బందులు పెట్టడం మనం ఎన్నో చూశాం. కొంతమంది వారి కెరియర్ ను దృష్టిలో పెట్టుకొని బయటకు వచ్చి చెప్పడానికి భయపడుతూ ఉంటారు. కానీ మరి కొంతమంది ధైర్యంగా బయటకు వచ్చి న్యాయం కోసం పోరాడుతారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ డాన్స్ మాస్టర్ చేతిలో మోసపోయి రోడ్డుపైకి ఎక్కింది అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ శష్టి వర్మ..

Jani Master is now in jail Jhansi wants to win

Jani Master is now in jail Jhansi wants to win

తనను జానీ మాస్టర్ మానసికంగా, శరీరకంగా వాడుకొని చివరికి మోసం చేశాడని చెబుతూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జానీ మాస్టర్ వ్యవహారం కాస్త సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో రచ్చ రచ్చ అయింది. దీంతో మాస్టారుపై ఫోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు. ఈ మధ్యకాలంలోనే బెయిల్ పై బయటకు బయటకు వచ్చారు జానీ మాస్టర్.ఇదే తరుణంలో లైంగిక వేధింపుల కేసుల గురించి తాజాగా వేధింపుల కమిటీలో కీలక సభ్యురాలుగా వ్యవహరిస్తున్నటువంటి యాంకర్ ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చింది. (Jani Master)

Also Read: NTR And Hrithik Roshan: చరణ్ తో సెట్ అయినట్లు హృతిక్ తో వర్కౌట్ అయ్యేనా తారక్?

ఇంతకీ ఆమె ఏమన్నదయ్యా అంటే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జానీ మాస్టర్ పై కేసు నెగ్గినట్టుగా ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.. అయితే పనిచేసే ప్రదేశంలో అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురైనట్టు నిజ నిజాలు బయటపడ్డ తర్వాత ఫిలిం చాంబర్ ఇచ్చిన ఆర్డర్లకు వ్యతిరేకంగా, జిల్లా కోర్టుని జానీ మాస్టర్ ఆశ్రయించారు. కానీ అన్ని పరిశీలించిన కోర్టు జానీ మాస్టర్ వేసిన అప్లికేషన్ ను తోసిబుచ్చి, ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది.

Jani Master is now in jail Jhansi wants to win

ముఖ్యంగా మహిళలు పని చేసే ప్రదేశాల్లో సేఫ్టీ ఎంతో ముఖ్యమంటూ కోర్ట్ చాటి చెప్పిందంటూ ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఫెడరేషన్ తో కలిసి పోరాటం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాసుకొచ్చింది. ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఆమెకు సపోర్ట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.(Jani Master)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *